మంత్రి సతీమణి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు | One injured in road accident | Sakshi
Sakshi News home page

మంత్రి సతీమణి కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

Published Thu, Sep 3 2015 7:07 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One injured in road accident

కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి) : దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒకరు గాయపడ్డారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన దొడ్ల రమేష్, ఇ.రమేష్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా కొంపల్లి చంద్రగార్డెన్స్ సమీపంలో మంత్రి సతీమణి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది.

ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న దొడ్ల రమేష్ కాలు విరిగిపోయింది. అతడిని వెంటనే పేట్‌బషీరాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి కారు డ్రైవర్ రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement