గురువప్ప(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్‌ను భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓ అభిమాని పార్టీ జెండాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపేట రాజీవ్ గృహకల్పలో టి.గురువప్ప(52) నివాసం ఉంటున్నాడు. వారాంతపు సంతలో వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అతడికి భార్య సంతోషితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వీరాభిమాని అయిన గురువప్ప స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం షెడ్డులో పార్టీ జెండాతో శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో ‘‘అమర వీరులకు వందనాలు, ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద్‌ను గెలిపించాలి. ఆయన మంత్రి కావాలి. కేసీఆర్ తిరిగి సీఎం కావాలి. నా కుటుంబాన్ని ఆదుకోవాలి’’ అని రాసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment