'హెచ్సీయూ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు' | venkaiah naidu attended grama sabha in quthbullapur | Sakshi
Sakshi News home page

'హెచ్సీయూ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు'

Published Wed, Apr 20 2016 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

venkaiah naidu attended grama sabha in quthbullapur

హైదరాబాద్ :  దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్లో నిర్వహించిన గ్రామసభలో వెంకయ్యనాయుడు పాల్లొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... కులవివక్ష, మత వివక్ష సరికాదని.. సామాజిక సామరస్యం కావాలని అన్నారు.

హెచ్సీయూ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలకాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. రైతు కష్టాలను దీర్ఘకాలిక పరిష్కారాలు కావాలని చెప్పారు. దేవాలయాల్లో అందరికి ప్రవేశం ఉండాలని వెంకయ్య ఆకాంక్షించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement