సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు కోరడంతో.. పలు నియోజకవర్గాల్లో కొన్ని వీవీప్యాట్‌లను కూడా లెక్కించినట్టు వెల్లడించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కానే కాదని, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లడం కూడా సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓట్ల ట్యాలీలో తేడా రాలేదన్నారు.
మాక్ పోల్ తర్వాత.. సీఆర్‌సీ బటన్ నొక్కితే మాక్ పోల్ ఓట్లు వెళ్లిపోతాయని, రిజల్ట్ బటన్ నొక్కితే ఎర్రర్ వచ్చిందని తెలిపారు. అప్పుడు ఏజెంట్స్ అందరి ముందూ క్లోసర్ బటన్ కొట్టి.. 17 సీ లిస్ట్ ప్రకారం ఓట్లు ట్యాలీ అయ్యాక ఫలితాలు లెక్కపెట్టామన్నారు. 100 శాతం వీవీప్యాట్‌లను లెక్కపెట్టాలంటే.. బ్యాలెట్ పేపర్ తరహా అవుతుందని, అది సాధ్యం కాదని తెలిపారు.
గవర్నర్‌కు గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఎస్‌కే రుడోలా బుధవారం గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment