సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఓట్ల లెక్కింపు ఈనెల మూడో తేదీన(ఆదివారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
దీంతో, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు ప్లాన్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
అలాగే, ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ పేర్కొంది. ప్రతీ టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్.. కౌంటింగ్ సూపర్ వైజర్.. ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక, ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై 2,400 కేసులు అయినట్టు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment