సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద అబై వ్)కు గణనీయ సం ఖ్యలో ఓట్లు పడ్డాయి. 2,24,709 మంది ఓటర్లు (1.1 శాతం ఓట్లు) నోటాకు ఓటేశారు. రెండు చోట్లలో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ కన్నా నోటాకు పడిన ఓట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీచేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్లతో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలు కాగా, ఇక్కడ నోటాకు 1,119 ఓట్లు పడ్డా యి.
బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో 1,016 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతుల్లో ఓటమి పాలుకాగా, ఆ నియో జకవర్గంలో నోటాకు 1,462 ఓట్లు వచ్చాయి. ఖమ్మం, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నోటా మూడోస్థానంలో నిలవడం విశేషం. ఇక 16 సీట్లలో నాలుగో స్థానంలో, 51 స్థానాల్లో ఐదోస్థానంలో నోటా నిలిచింది. ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులపై తమ అసంతృప్తిని నోటాకు ఓటు వేయడం ద్వారా వ్యక్తం చేశారు.
ఖమ్మంలో 3,513, శేరిలింగంపల్లిలో 3,637, హుజూరాబాద్‌లో 2,867 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే అలంపూర్ (3,492), ములుగు (3,249), ఉప్ప ల్ (2,712), నర్సంపేట (2,436) అందోల్ (2,4 06), జగిత్యాల (2,203), చెన్నూర్(2,135), మంథని (2,083), నిజామాబాద్ –రూరల్ (2,2 03), సికింద్రాబాద్ (1,582), ముషీరాబాద్ (1,664), అచ్చంపేట (1,485), సనత్‌నగర్ (1,464), గోషామహల్‌లో 709 ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment