పార్లమెంట్ పరిధిలో నోటాకు మూడో స్థానం
మొత్తంగా 26,235 ఓట్లు నమోదు
యలమంచిలి రూరల్: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ, వైఎస్సార్‌సీపీ వంటి ప్రధాన పారీ్టల అభ్యర్థులను మినహాయిస్తే ఇతర పారీ్టలు, స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ప్రజల మద్దతును పొందడంలో విఫలమైన ఆ 13 మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు. వారికి పోలైన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉండడం విశేషం.
పలకా శ్రీరామ్మూర్తికి 19,157, వేది వెంకటేష్ కు 24,833, నమ్మి అప్పలరాజుకు 2589, ఆడారి శరత్ చంద్రకు 1886, వడ్లమూరి కృష్ణస్వరూప్‌కు 3549, కర్రి విజయలక్ష్మికి 1578, తుమ్మగుంట అప్పలనాయుడుకు 1055, గారా సత్యారావుకు 3116, జున్నూరి జె శ్రీనివాస్‌కు 1195, డాక్టర్ తుమ్మపాల హరిశంకర్‌కు 1567, పెట్ల నాగేశ్వర్రావుకు 2179, సిద్ధా లోవరాజుకు 3845, వంకాయల రామచంద్రరావుకు 4001 ఓట్లు పోలవ్వగా వీరందరి కంటే అధికంగా నోటాకు 26,235 ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా మాడుగులలో 4880 ఓట్లు, అత్యల్పంగా అనకాపల్లిలో 1924 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
అసెంబ్లీల పరిధిలో నోటాకు వచ్చిన ఓట్లు 20,111
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రెండు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 4,107 రాగా..అత్యల్పంగా అనకాపల్లిలో 1,853 వచ్చాయి. యలమంచిలిలో 2,409, చోడవరంలో 3,849, మాడుగులలో 4,070, నర్సీపట్నంలో 3,824.. మొత్తం 20,111 ఓట్లు నోటాకు పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment