బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి | Steel factory at Bayyaram needed, says ysr congress party mp ponguleti srinivasa reddy | Sakshi
Sakshi News home page

బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి

Published Tue, Jul 15 2014 11:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి

బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి

ఖమ్మం : ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో వేలాదిమంది గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ లేదా ఇన్ఫాట్ నిగమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని పొంగులేటి  సోమవారం పార్లమెంట్లో ప్రస్తావించారు.

జిల్లాలో సుమారు 1.41 లక్షల ఎకరాల్లో ఇనుపరాయి నిక్షేపాలు దాగి ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో గార్ల, బయ్యారం, నేలకొండపల్లి మండలాలతో పాటు సమీప వరంగల్ జిల్లాలో కూడా ఫ్యాక్టరీకి కావల్సిన నిక్షేపాలు అపారంగా ఉన్నాయన్నారు. జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల రాష్ట్రానికి రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement