హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉక్కు తయారీ కంపెనీ సుగ్న మెటల్స్ తెలంగాణ వికారాబాద్‌లోని పరిగిలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే ప్రాంతంలో సుగ్న 2008లో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టర్బో టీఎంటీ రాడ్లతో పాటూ ఉక్కు తయారీలో వినియోగించే బిల్లెట్లు, స్పాంజ్ ఐరన్ వంటివి కూడా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఉక్కు తయారీ, పటిష్టతను వివరించేందుకు వివిధ విభాగాల్లోని ఇంజనీర్లతో కలిసి సుగ్న మెటల్స్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) నితిన్ జైన్, ప్లాంట్ ఇంచార్జీ అజయ్ కుమార్ తదితరులు ప్లాంట్‌ను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment