'ఉక్కు కర్మాగారాన్ని సాధిద్దాం' | protest for Brahmani Plant in ysr district | Sakshi
Sakshi News home page

'ఉక్కు కర్మాగారాన్ని సాధిద్దాం'

Published Sat, Jan 16 2016 1:25 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

కడప ఉక్కు-సీమ హక్కు నినాదంతో అందరూ ఒక్కటై ఉద్యమించి వైఎస్ఆర్ జిల్లాకు ఉక్కు కర్మాగారాన్ని సాధించాలని ఉక్కు కర్మాగారం సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రొద్దుటూరు: కడప ఉక్కు-సీమ హక్కు నినాదంతో అందరూ ఒక్కటై ఉద్యమించి వైఎస్ఆర్ జిల్లాకు ఉక్కు కర్మాగారాన్ని సాధించాలని ఉక్కు కర్మాగారం సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న సమితి కార్యాలయంలో మాట్లాడారు.
 
మహానేత వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేయతలపెట్టిన బ్రాహ్మణి ప్లాంట్‌ను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్లాంట్ ఏర్పాటైతే జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అధికార పార్టీ జిల్లాపై వివక్ష చూపుతోందని విమర్శించారు. ఐకమత్యంతో ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుందామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement