ఊరిస్తున్న ‘ఉక్కు’!
Published Wed, Oct 5 2016 2:46 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
పట్టాలెక్కని పరిశ్రమ
అధ్యయనానికి మరో కమిటీ
తొలుత రెండు బృందాల సర్వే
రూ.30వేల కోట్ల ప్రాజెక్టుకు
ముహూర్తమెప్పుడో..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఊరిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. పరిశ్రమ నిర్మాణం మాత్రం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెరుుల్) బృందం రెండున్నరేళ్ల క్రితం కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి ప్రభుత్వాలకు నివేదిక అందజేసింది. దీనిపై స్పందించని కేంద్రం.. తాజాగా మళ్లీ అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎప్పుడు పునాదులు పడతాయోనని ఆ ప్రాంతవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆధారమైన ముడి ఇనుప ఖనిజం జిల్లాలో పుష్కలంగా ఉంది. నిక్షేపాలు నిక్షిప్తమైన ఉన్న ప్రాంతంలోనే కర్మాగారం ఏర్పాటు చేయాలని జిల్లావాసులతోపాటు రాజకీయ పక్షాలు కొన్నేళ్లుగా నినదిస్తున్నారుు. అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారుు. ఉమ్మడి రాష్ట్రంలో 2014, మే 21, 22 తేదీల్లో ఎనిమిది మంది సభ్యులతో కూడిన సెరుుల్ బృందం గార్ల, బయ్యారంలో పర్యటించి.. ఇనుప ఖనిజాలున్న భూములను పరిశీలించింది. బయ్యారం, గార్ల, నేలకొండపల్లిలో ముడి ఇనుప ఖనిజంతోపాటు సంబంధిత ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెరుుల్ బృందం నివేదిక అందజేసింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వాలకు నివేదికను పంపింది.
బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. నల్లగొండ జిల్లాలో సున్నపురారుు(లైమ్‌స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలు మార్గం 14 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు. స్టీల్ ప్లాంట్‌లో ముడి ఇనుమును శుద్ధి చేసేందుకు ప్రధానంగా నీరు అవసరం. అరుుతే బయ్యారం మండలానికి సమీపంలో ఎక్కడెక్కడ నీటి వనరులున్నాయో అధికారులు నివేదించారు. హైదరాబాద్‌లోని హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదికలో ప్రతిరోజు ప్లాంట్‌కు 5,000 క్యూబిక్ మీటర్ల(49 క్యూసెక్కులు) నీటి అవసరం ఉంటుందని, దీని ప్రకారం కొన్ని నీటి వనరులను జిల్లా అధికారులు ప్రతిపాదించారు.
పామర్ కంపెనీ పరిశీలన
ఏడాదిన్నర క్రితం గార్ల, బయ్యారంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పామర్ కంపెనీ ప్రతినిధుల బృందం ఇనుప ఖనిజం నిల్వలున్న భూములు, అధికారులు స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములను పరిశీలించింది. గార్ల మండలం శేరిపురం, బయ్యారం మండలం ధర్మాపురంలో బృందం పర్యటించింది. ప్రభుత్వం పరిశ్రమ నిర్మాణం కోసం తమకు భూములు కేటారుుస్తే ఉక్కు కర్మాగారంతోపాటు థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తామని కంపెనీ బృందం ప్రకటించింది. దీంతో అసలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ సెరుుల్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతుందా.. లేక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తుందా..? అనేది అప్పట్లో చర్చ జరిగింది. కేంద్రం.. రాష్ట్రానికి చేయూతనివ్వకపోతే భారీ ఎత్తున నిధుల సమీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
పునాది పడేదెప్పుడు..?
ఏళ్లతరబడి ఊరిస్తున్న బయ్యారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అరుుతే ఇటు సెరుుల్ అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్రానికి అందజేసినా.. కేంద్రం మాత్రం చూస్తాం.. చేస్తాం అంటూ కాలయాపన చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణంపై చురుకుగా ముందుకెళ్లకపోవడంతో.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నారుు. మంగళవారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఇక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇంకెన్నాళ్లు సర్వేలు, అధ్యయనాలతో కాలయాపన చేస్తారని ఇక్కడి ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement