జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: హరీశ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని మంగళవారం టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన సవాల్‌కు మంత్రి స్పందించారు. ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని ఆయన ప్రతి సవాల్ విసిరారు.