కొల్లాపూర్, న్యూస్‌లైన్: హైదారాబాద్‌పై పూర్తి హక్కులు కలిగిన సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు విశ్రమించేది లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు టి. హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ మునిగిపోయే పార్టీ అని అన్నారు. చంద్రబాబు వైఖరి టీడీపీ నాయకులకే అర్థం కావడం లేదన్నారు.
తెలంగాణను అడ్డుకునేందుకు బాబు అన్నివిధాలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్ మండల పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి టి.హరీష్‌రావుతో పాటు ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే. గోయల్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మా ఆంధ్ర, మీ తెలంగాణ అంటూ ప్రకటనలు చేయడం ఆయన వివక్షపూరిత ధోరణికి నిదర్శనమన్నారు.
చిత్తూరు జిల్లాకు రూ.5800కోట్లు తాగునీటి కోసం కేటాయించిన సీఎం పాలమూరు జిల్లా కు అందులో పదిశాతమైన కేటాయించారా? అని ప్రశ్నించారు. దీనికి సీఎంతోపాటు చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని త్యజించిన జూపల్లి కృష్ణారావును వచ్చే ఎన్నికల్లో 70వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో మళ్లీ జూపల్లికి మంత్రి పదవి దక్కుతుందని హరీష్‌రావు అన్నారు.
దోచుకోవడమే సమన్యాయమా?
అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే.గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలోని వనరులన్నింటి నుంచి సీమాంధ్ర వారు లబ్ధిపొందుతున్నారని అన్నారు. మా వనరులన్నీ దోచుకోవడమే సమన్యాయమా? అని ప్రశ్నించారు. భద్రా ద్రి రాముడిని కూడా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారా వు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదన్నారు.ప్రజల అమాయకత్వాన్ని ఆస రాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందుతున్న ఆంధ్రా పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. కే సీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నా రు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ వి ఠల్‌రావుఆర్యా, ఇంతియాజ్, నాయకులు కొత్తా రాంమోహన్‌రావు, కృష్ణప్రసాద్, రాంచంద్రారె డ్డి, బాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గడ్డం శేఖర్‌యాద వ్, హన్మంతునాయక్, లక్ష్మి, రమాదేవి, రామన్‌గౌడ్, రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌పై తెలంగాణకే హక్కు
నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు సమన్యాయం పేరుతో కప్పదాటు వ్యవహారం చేస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి. హరీష్‌రావు విమర్శించారు. పూటకో మాట, రోజుకో లేఖ ఇస్తూ తెలంగాణకు అడ్డంకిగా మారారని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్‌లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలది పూర్తి అవకాశవాదమని, ఏపీఎన్జీఓల నాయకుడు అశోక్‌బాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టంచేశారు. టీజీ. వెంకటేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని హరీష్‌రావు అన్నారు. హైదారాబాద్ చుట్టూ ఉన్న భూములు, అక్రమ వ్యాపారాలపై ప్రేమతోనే ఆ విధంగా మాట్లాడుతున్నట్లు ఆరోపించారు.
తెలంగాణ బిల్లును శాసనసభకు పంపితే ప్రోరోగ్ కాకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ మంత్రిగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుపై ఉందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తప్పనిసరి అని, నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా ఏర్పడుతుందని చెప్పారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని చేసిన అభివృద్ధి రైతుల ఆత్మహత్యలేనని ఎద్దేవాచేశారు. సీఎం కిరణ్ గోదావరి నీటిని దమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా దోచుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, జక్క రఘునందన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ తెలంగాణ కావాలి
Published Mon, Nov 25 2013 3:51 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement