కొండాపూర్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన ఆభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ఆభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్కాపూర్, గిర్మాపూర్, తొగర్‌పల్లి గ్రామాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్‌చార్జి చింతా ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కళాకారుల ఆట పాటల మధ్య గ్రామాల్లో చేపట్టిన ర్యాలీలో హరీష్‌రావుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గారెడ్డికి తెలంగాణ ద్రోహిగా ముద్రపడిందన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులకు ఏజెంటుగా ఉంటూ ఆభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచుకొని మన డబ్బులు మనకే పంచడం దారుణమన్నారు. అలాంటి వ్యక్తి బలపర్చిన ఆభ్యర్థులను గెలిపిస్తే ఆంధ్రవాళ్లకు ఓట్లు వేసినట్లేనన్నారు. కొండాపూర్‌కు జెడ్పీ చైర్మన్ అయ్యే ఆవకాశం రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. 2001 నుంచి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, ఎమ్మెల్సీ పదవిని ఆరు నెలలకే త్యాగం చేసిన ఘనత పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణకు దక్కుతుందన్నారు.
ఆయన మేనకోడలు నాగరాణి జెడ్పీటీసీ ఆభ్యర్థిగా కొండాపూర్ నుంచి పోటీ చేస్తున్నారన్నారు. ఆమెను గెలిపిస్తే జెడ్పీ చైర్మన్ పదవి రావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఆన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆభ్యర్థి పి. నాగరాణి, ఎంపీటీసీ ఆభ్యర్థులు వసంత అంజనేయులు గౌడ్, కౌసల్య జలంధర్, నీరాడివాణి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లాగౌడ్, మాణిక్‌రెడ్డి, యాదయ్య, అంజిరెడ్డి, శంకర్‌యాదవ్, పి.మల్లేశం, నాగయ్య, నర్సింలు, రాజునాయక్, ఖమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి
Published Thu, Mar 27 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:12 AM
Advertisement
Advertisement