r.satyanarayana
-
టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి
కొండాపూర్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన ఆభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ఆభివృద్ధికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని మల్కాపూర్, గిర్మాపూర్, తొగర్పల్లి గ్రామాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కళాకారుల ఆట పాటల మధ్య గ్రామాల్లో చేపట్టిన ర్యాలీలో హరీష్‌రావుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గారెడ్డికి తెలంగాణ ద్రోహిగా ముద్రపడిందన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులకు ఏజెంటుగా ఉంటూ ఆభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచుకొని మన డబ్బులు మనకే పంచడం దారుణమన్నారు. అలాంటి వ్యక్తి బలపర్చిన ఆభ్యర్థులను గెలిపిస్తే ఆంధ్రవాళ్లకు ఓట్లు వేసినట్లేనన్నారు. కొండాపూర్‌కు జెడ్పీ చైర్మన్ అయ్యే ఆవకాశం రావడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. 2001 నుంచి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, ఎమ్మెల్సీ పదవిని ఆరు నెలలకే త్యాగం చేసిన ఘనత పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణకు దక్కుతుందన్నారు. ఆయన మేనకోడలు నాగరాణి జెడ్పీటీసీ ఆభ్యర్థిగా కొండాపూర్ నుంచి పోటీ చేస్తున్నారన్నారు. ఆమెను గెలిపిస్తే జెడ్పీ చైర్మన్ పదవి రావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆభ్యర్థి పి. నాగరాణి, ఎంపీటీసీ ఆభ్యర్థులు వసంత అంజనేయులు గౌడ్, కౌసల్య జలంధర్, నీరాడివాణి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లాగౌడ్, మాణిక్‌రెడ్డి, యాదయ్య, అంజిరెడ్డి, శంకర్‌యాదవ్, పి.మల్లేశం, నాగయ్య, నర్సింలు, రాజునాయక్, ఖమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ పోలో జట్టు కెప్టెన్‌గా రాకేష్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ సైకిల్ పోలో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఏపీ సైకిల్ పోలో అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సత్యనారాయణ ప్రకటించారు. ఈ పోటీలు ఆదివారం నుంచి మహారాష్ట్రలోని జెల్గావ్లో జరుగుతాయి. రాష్ట్ర సబ్ జూనియర్ బాలుర జట్టు: కె.రాకేష్ (కెప్టెన్), శరణ్ (ప్రకాశం), వంశీ (మహబూబ్‌నగర్), ఎన్.భరత సింహారెడ్డి, కె.చక్రధర్ (కృష్ణా జిల్లా), కల్యాణ్ (గుం టూరు), ఎస్.కె.జావిద్ బాషా (ప్రకాశం), వి.రేవంత్ కుమార్ (కృష్ణా). జూనియర్ బాలుర జట్టు: ఎం.మస్తాన్ (కెప్టెన్, కృష్ణా జిల్లా), బి.రవితేజ, కె.భాను ప్రకాష్ (రంగారెడ్డి), బి.శ్రీను (పశ్చిమ గోదావరి), ఎస్.కె.ఖాదర్ (ప్రకాశం), జె.తేజ (కృష్ణా), జె.రాజేష్ నాయక్ (మహబూబ్‌నగర్), ఎస్.కె.జంషెద్ (కర్నూలు), కోచ్: ఎం.అవినాశ్ (కరీంనగర్), జట్టు మేనేజర్: ఎం.అచ్చయ్య (గుంటూరు). -
‘బిల్లు’లో అభ్యంతరకర అంశాలు
జోగిపేట, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన విభజన బిల్లులో తెలంగాణకు అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన జోగిపేటలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షను, జలాలు, ఆస్తులు, అప్పులు, ఉన్నత విద్యకు సంబంధించిన అం శాల్లో తెలంగాణకు నష్టం జరిగే విధంగా ముసాయిదాలో పొందుపరచారన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 83వేల మంది తెలంగాణ వారికి చెందిన ఉద్యోగాల్లో అక్రమంగా చేరారన్నారు. 1969లో జీఓ 36 ప్రకారం 24వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, 1985లో జీఓ 610 ప్రకారం 59 వేల మంది అక్రమంగా నియమితులయ్యారని, వీరిని వెంటనే వారి వారి స్వస్థలాలలకు పంపించాలని జీఓ జారీ చేసినా నేటి వరకు అమలుకాలేదన్నారు. ఆరు సూత్రాల పథకానికి విరుద్ధంగా ఆంధ్ర ఉద్యోగులు 1.62 లక్షల మంది తెలంగాణలో పనిచేస్తున్నారన్నారు. వీరందరిని ఆంధ్ర ప్రాంతానికి పంపిస్తే తెలంగాణకు సంవత్సరానికి రూ.5 వేల కోట్లు మిగులుతాయన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ప్రాం తాల వారీగా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.1.70 వేల కోట్ల అప్పులున్నాయని, వీటిని ఏ ప్రాంతానికి ఎక్కువ ఖర్చుపెట్టారో ఆ విధంగానే పంపకాలుండాల న్నారు. సింగరేణి, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల నుంచి ఎలాంటి సూచనలు ముసాయిదాలో చేయలేదన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ శాంతి భద్రతలను రాష్ట్ర గవర్నర్‌కు అప్పగించారని విమర్శించారు. సమావేశంలో అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య, జిల్లా నాయకులు డీబీ నాగభూషణం, ఏ.శంకరయ్య, మండల నాయకులు సిహెచ్.వెంకటేశం, జి.ఎల్లయ్య, ఎండి.ఖాజా పాల్గొన్నారు.