ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్ సైకిల్ పోలో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఏపీ సైకిల్ పోలో అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సత్యనారాయణ ప్రకటించారు. ఈ పోటీలు ఆదివారం నుంచి మహారాష్ట్రలోని జెల్గావ్‌లో జరుగుతాయి.
రాష్ట్ర సబ్ జూనియర్ బాలుర జట్టు: కె.రాకేష్ (కెప్టెన్), శరణ్ (ప్రకాశం), వంశీ
(మహబూబ్‌నగర్), ఎన్.భరత సింహారెడ్డి, కె.చక్రధర్ (కృష్ణా జిల్లా), కల్యాణ్ (గుం టూరు), ఎస్.కె.జావిద్ బాషా (ప్రకాశం), వి.రేవంత్ కుమార్ (కృష్ణా). జూనియర్ బాలుర జట్టు: ఎం.మస్తాన్ (కెప్టెన్, కృష్ణా జిల్లా), బి.రవితేజ, కె.భాను ప్రకాష్ (రంగారెడ్డి), బి.శ్రీను (పశ్చిమ గోదావరి), ఎస్.కె.ఖాదర్ (ప్రకాశం), జె.తేజ (కృష్ణా), జె.రాజేష్ నాయక్ (మహబూబ్‌నగర్), ఎస్.కె.జంషెద్ (కర్నూలు), కోచ్: ఎం.అవినాశ్ (కరీంనగర్), జట్టు మేనేజర్: ఎం.అచ్చయ్య (గుంటూరు).
సైకిల్ పోలో జట్టు కెప్టెన్‌గా రాకేష్
Published Sun, Feb 9 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement