ఇసుక మాఫియా విషయంలో టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండించారు.
సాక్షి, హైదరాబాద్: ఇసుక మాఫియా విషయంలో టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఖండిం చారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 24 గంటల్లోగా రేవంత్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సచివాలయంలో మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రేవంత్‌రెడ్డికి అలవాటేనన్నారు.
నా కుటుంబానికి సంబంధమే లేదు: పోచారం
నిజమాబాద్ జిల్లాలో ఇసుక తవ్వకాల విషయంలో తనకు కాని, తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనివల్ల తమకు పట్టు లేకుండాపోతోందని, పుట్టగతులు ఉండవన్న అక్కసుతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు.