రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల | Rs 1,200 Crore Released On Farmer Loan Waiver By Telangana Government | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల

Published Fri, May 8 2020 1:49 AM | Last Updated on Fri, May 8 2020 8:41 AM

Rs 1,200 Crore Released On Farmer Loan Waiver By Telangana Government - Sakshi

ఆర్థిక, వ్యవసాయ శాఖ సంయుక్త సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ. 25 వేల లోపున్న రైతు రుణాలను ఆర్థిక శాఖ ఏకమొత్తం గా మాఫీ చేస్తూ రూ.1,200 కోట్లు విడుదల చేసింది. 6.10 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొతాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్యభవన్‌లో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి వెనువెంటనే రుణ మొ త్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రూ.25 వేల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల్లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణచెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందు కు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు.

వచ్చే సీజన్‌కు రైతుబంధుకు రూ.7వేల కోట్లు 
ఇటు వానాకాలం పంటకు రైతుబంధు సాయం పైనా మం త్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్‌లో వానాకాల పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేసినట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు కింద డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ.7వేల కోట్లను ఈ నెల రోజుల్లో పంట సీజన్‌ ఆరంభమయ్యే నాటి కల్లా రైతులకు అందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాల ప్రకారం ఇతర ఖర్చులు తగ్గించుకొనైనా రైతు లు పంటలువేసే సమయానికన్నా ముందే ఖాతాల్లో డబ్బు లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 1.40 కోట్ల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించడం జరిగిందన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో కలసి పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను హరీశ్‌రా వు, నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. రైతులకు అందించే రుణమా ఫీ మొత్తాలను వెంటనే వారి అకౌంట్లలో జమయ్యే విషయం లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని బ్యాంకు అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖ ము ఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement