Loan Waiver for farmers
-
రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ. 25 వేల లోపున్న రైతు రుణాలను ఆర్థిక శాఖ ఏకమొత్తం గా మాఫీ చేస్తూ రూ.1,200 కోట్లు విడుదల చేసింది. 6.10 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొతాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్యభవన్‌లో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రులు సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి వెనువెంటనే రుణ మొ త్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రూ.25 వేల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల్లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణచెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందు కు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు. వచ్చే సీజన్‌కు రైతుబంధుకు రూ.7వేల కోట్లు ఇటు వానాకాలం పంటకు రైతుబంధు సాయం పైనా మం త్రులు అధికారులతో సమీక్ష జరిపారు. జూన్‌లో వానాకాల పంటకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతుబంధు నిధులను విడుదల చేసినట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు కింద డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు కింద రూ.7వేల కోట్లను ఈ నెల రోజుల్లో పంట సీజన్ ఆరంభమయ్యే నాటి కల్లా రైతులకు అందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఇతర ఖర్చులు తగ్గించుకొనైనా రైతు లు పంటలువేసే సమయానికన్నా ముందే ఖాతాల్లో డబ్బు లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 1.40 కోట్ల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించడం జరిగిందన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్తుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో కలసి పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను హరీశ్‌రా వు, నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. రైతులకు అందించే రుణమా ఫీ మొత్తాలను వెంటనే వారి అకౌంట్లలో జమయ్యే విషయం లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని బ్యాంకు అధికారులను మంత్రులు ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖ ము ఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ రైతులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఈ నెలలోనే మాఫీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు...5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. (చదండి : తెలంగాణ బడ్జెట్ 2020-21 హైలైట్స్) ఈ నెలలోనే రూ.25వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడానికి రూ.1,198 కోట్లు విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ రుణమాఫి మొత్తాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్యేలు రైతులకు అందిస్తామని చెప్పారు. 25 వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలను మొత్తం రూ. 24 వేల 738 కోట్లు ఉన్నాయన్నారు. నాలుగు విడతలుగా ఎమ్మెల్యేలు చెక్కుల రూపంలో అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లను ప్రతిపాదించామన్నారు. ఎంత ఖర్చైనా కందులను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. -
రైతులకు పసుపు పత్రాలు ఎందుకు ఇచ్చారు?
సాక్షి, అమరావతి : టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయకుండా.. ఇప్పుడు రుణమాఫీ చేస్తారా లేదా అంటూ తమని ప్రశ్నిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మొత్తం రూ. 87 వేల కోట్ల రైతు రుణ మాఫీ ఉంటే.. టీడీపీ టీడీపీ సర్కార్ దానిని రూ. 24 వేల కోట్లకు కుదించిందన్నారు. శుక్రవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై సభ్యులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వాటికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం నాలుగు, ఐదు విడతల్లో రుణమాఫీ డబ్బులు ఇవ్వదలచుకుంటే.. రైతులకు పసుపు పత్రాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పైగా వాటికి ఎటువంటి వ్యాలిడిటీ లేదన్నారు. మార్చి 10 సాయంత్రం ఈ మేరకు జీవో ఇచ్చారన్నారు. టీడీపీకి రైతులను ఆదుకునే ఆలోచన ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి 24 గంటల ముందు ఎందుకు జీవో ఇస్తారని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీని మధ్యలో వదిలేసి అన్నదాత సుఖీభవ ప్రకటించిందని తెలిపారు. రుణమాఫీకే డబ్బులు ఇవ్వలేకపోయారని.. అలాంటిది అన్నదాత సుఖీభవకు ఎక్కడి నుంచి నిధులు తీసుకువస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే టీడీపీ ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని అప్పటికప్పుడే ప్రారంభించిందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. వాటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడిగే అధికారం టీడీపీకి ఎక్కడుందని నిలదీశారు. కనీసం రైతులకు విత్త బకాయిలు కూడా టీడీపీ చేయలేదని మండిపడ్డారు. -
పథకాల నగదు లబ్ధిదారులకే అందాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ డబ్బుల్ని బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులు, డ్వాక్రా సభ్యులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. సున్నా వడ్డీ కింద లబ్ధిదారుల తరఫున చెల్లించాల్సిన వడ్డీ డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు. రుణాల వసూళ్ల విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను వేధింపులకు గురి చేయొద్దని బ్యాంకర్లకు సూచించారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు రావడంతో రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని, రుణభారంతో కుంగిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచకపోతే పరిణామాలు ప్రమాదకరంగా మారతాయన్నారు. ఈ విషయాన్ని గమనించే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, నిలదొక్కుకునేలా చూసేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచనతోనే మే నెలలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నేరుగా ఇవ్వబోతున్నట్లు బ్యాంకర్లకు తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో రైతు వద్ద సగటున 1.25 ఎకరాలు మాత్రమే భూమి ఉందని, ఇలాంటి రైతులందరికీ పెట్టుబడి వ్యయంలో దాదాపుగా 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఉద్దేశంతోనే రైతు భరోసాను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇస్తున్న ఈ సొమ్మును, ఇంతకుముందు వారికి ఉన్న అప్పులకు జమ చేసే వీలే ఉండకూడదని బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. రైతు భరోసా కింద గానీ, నవరత్నాల్లో భాగంగా అమలు చేయబోతున్న మరే సంక్షేమ పథకాల్లో గానీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే నగదును జమ చేసుకోవడానికి వీల్లేని విధంగా ఖాతాలను తెరవాలని స్పష్టం చేశారు. ప్రతీ పైసా నేరుగా అందాలి అలాగే రాష్ట్రంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉందని, జాతీయ స్థాయిలో నిరక్షరాస్యత 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉందన్నారు. ఈ పరిస్థితులు మార్చి ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకే ‘అమ్మ ఒడి’ కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. నవరత్నాల్లోని ఈ పథకాలన్నింటి ద్వారా తాము అందించబోయే ప్రతి పైసా వారికే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. నిజంగా ఈ రుణ మొత్తం ఇస్తున్నారా? ఎస్ఎల్బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు పెరుగుతున్నట్టు చూపిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఈ డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేదా పాత రుణాలను రీషెడ్యూల్ చేయడం వల్ల పెరుగుతున్నాయా అంటూ బ్యాంకర్లను ప్రశ్నించారు. కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడం వల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు అంగీకరించారు. దీనివల్ల రైతులు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలపడకుండా మరింత అప్పుల పాలైనట్లు ఎస్ఎల్బీసీ సమావేశంలో తేలింది. గత ప్రభుత్వం సున్నా వడ్డీ కోసం చెల్లించాల్సిన తన వాటాను చెల్లించిందా అని సీఎం ఆరా తీయగా బ్యాంకర్ల నుంచి లేదన్న సమాధానం వచ్చింది. రైతులకు సున్నా వడ్డీ లభించకపోవడం, రుణమాఫీ రూ.87,612 కోట్లు చేస్తానని చెప్పి చివరకు రూ.15 వేల కోట్లు కూడా చేయకపోవడంతో రైతులు పూర్తిగా అప్పులు పాలైన విషయాన్ని పాదయాత్రలో స్వయంగా చూసినట్లు సీఎం తెలిపారు. రూ.87,612 కోట్ల రుణాల మీద ఏటా రైతులు రూ.7 వేల నుంచి 8 వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు ప్రభుత్వం ఏటా సగటున రూ.3 వేల కోట్లు కూడా రుణమాఫీకి విడుదల చేయలేదని, దీనివల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. శనగ రైతులకు ప్రభుత్వ అండ రాయలసీమలో ఎక్కువగా శనగ రైతులు మద్దతు ధర సమస్యను ఎదుర్కొంటున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చేతికొచ్చిన పంటకు తగు మద్దతు ధర రానప్పుడు కలిగే రుణ భారం నుంచి ఉపశమనం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ధర పడిపోయినందున సరకుపై రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు సరకు వేలంను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకర్లను కోరారు. అప్పటికీ ధర రాకపోతే శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1700 ప్రభుత్వమే చెల్లించే ఆలోచన చేసి ఆదుకుంటుందని ప్రకటించారు. బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్ర బోస్, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు జె.పకీరస్వామి, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ శుభ్రత్ దాస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.శెల్వరాజ్ పాల్గొన్నారు. 2019-20 పంట రుణాల లక్ష్యం.. రూ.1,15,000 కోట్లు గత ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణాల మాఫీ వాగ్దానం వల్ల రైతులకు లాభం జరగకపోగా వారు మరింతగా అప్పులు పాలయ్యారని స్పష్టమైంది. 2014, మార్చి 31 నాటికి రూ.87,612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు 2019, మార్చి 31 నాటికి అంటే ఐదేళ్ల తర్వాత రూ.1,49,264 కోట్లకు పెరిగాయి. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోవడంతో 2014, మార్చి 31న రూ.14,204 కోట్లు ఉంటే, 2019, మార్చి 31న అవి రూ.27,451 కోట్లకు పెరిగాయి. 2018–19లో మొత్తంగా రూ.1,01,564 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయిస్తే రూ.1,06,560 కోట్లు రైతులకు అందించామని, 2019–20లో రూ.1,15,000 కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని సంకల్పిస్తున్నామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తన లక్ష్యాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచింది. ఇందులో స్పల్పకాలిక పంట రుణాల కింద రూ.84,000 కోట్లు, టర్మ్ రుణాలు రూ.24,000 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యంలో రూ.8,400 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర రంగాల రుణాలను కూడా కలుపుకుంటే 2019–20 సంవత్సరానికి మొత్తం రూ.2,29,200 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. -
తొలి సంతకాలకే దిక్కు లేదు
రైతు రుణాల మాఫీ చంద్రబాబు గద్దెనెక్కే నాటికి రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ తరువాత వివిధ రకాల కోతలు, షరతులతో రుణాలను రూ.24,500 కోట్లకు కుదించేశారు. ఇప్పటివరకు మూడు విడతల్లో మాఫీ చేసిన రుణాలు రూ. 14,497 కోట్లు మాత్రమే. ఇది వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి 1,26,000 కోట్లకు చేరుకుని 35 లక్షల మంది డిఫాల్టర్లుగా మారారు. వారికి కొత్త రుణాలు ఇచ్చేదే లేదని బ్యాంకులు తేల్చిచెబుతున్నాయి. డ్వాక్రా రుణ మాఫీ చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. కానీ, నాలుగున్నరేళ్లలో డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి పైసా కూడా ఇవ్వకుండా దగా చేశారు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. బెల్టు దుకాణాల రద్దు మద్యం బెల్టు షాపులను తక్షణమే రద్దు చేస్తున్నామని నమ్మబలుకుతూ ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు సంతకం చేశారు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు షాపుల వాటా రూ.9 వేల కోట్లకు పైమాటే. ఎన్టీఆర్ సుజల ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన చేసిన తొలి సంతకాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు కూడా ఒకటి. నాలుగున్నరేళ్లుగా ఈ పథకం పక్కాగా ఆమలైన దాఖలాలే లేవు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచినీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మరో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాక్షి, అమరావతి: 2014 జూన్ 8వ తేదీన ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నానంటూ సీఎం హోదాలో తొలిసారిగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. నాలుగున్నరేళ్లు దాటినా ఆ తొలి సంతకాలకు దిక్కులేకుండా పోయింది. తొలి సంతకాలంటే శిలాక్షరాలే. కానీ, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలపై ముఖ్యమంత్రి మళ్లీ కొత్త హామీల వల విసురుతుండడం గమనార్హం. తొలి సంతకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో పరిశీలిస్తే చంద్రబాబు చేసిన మోసం తేటతెల్లమవుతుంది. రైతన్నలను నట్టేట ముంచేశారు రాష్ట్రంలో వ్యవసాయ రుణమాఫీ అటకెక్కింది. చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పూర్తిగా అమలులోకి రాలేదు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతు రుణాలు బేషరతుగా మాఫీ కావాలి. అయితే ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ. 14,497 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి రూ. 1,26,000 కోట్లకు చేరుకున్నాయి. రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో 35 లక్షల మంది రైతుల ఖాతాలు డిఫాల్టర్లుగా మారాయి. వారికి కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. రుణాలు చెల్లించని రైతుల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. లక్షలాది మందికి బ్యాంకుల నుంచి తాఖీదులు వచ్చాయి. అప్పులు కడతారా? లేక అరెస్టులు చేయించి కోర్టులకు ఈడ్చమంటారా? అంటూ బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్న, చిన్నకారు, కౌలు రైతులు సాగు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. వాటిని తీర్చే దారి కనిపించక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పల్లెపల్లెనా బెల్టు షాపుల జాతర మద్యం బెల్టు దుకాణాలను వెంటనే రద్దు చేస్తున్నామంటూ చంద్రబాబు చేసిన సంతకం అపహాస్యం పాలైంది. బెల్టు దుకాణాల రద్దుపై చంద్రబాబు మొక్కుబడిగా ఓ జీవో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో బెల్టు షాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి కోసం గ్రామాల్లో ఏకంగా వేలంపాటలు జరుగుతున్నాయి. వీధివీధినా బెల్టు దుకాణాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కడా లేకుండా కత్తిరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ.. బెల్టు షాపుల రద్దు అనేది పెద్ద బూటకమని తేటతెల్లమైంది. నిన్న మొన్నటి దాకా ఫ్యాన్సీ దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపులు, మెడికల్ షాపుల్లో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహించిన వారు ఇప్పుడు తోపుడు బండ్లపైనా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 వరకు బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు అనుబంధంగా 10కిపైగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు దుకాణాల వాటా రూ.9 వేల కోట్ల పైమాటే కావడం గమనార్హం. జాడ లేని ఎన్టీఆర్ సుజల చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ఎన్టీఆర్ సుజల పథకం ఏమైందో తెలియదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా అందిస్తామని, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆ మేరకు సంతకం కూడా చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 48,363 నివాసిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో కేవలం 906 నివాసిత ప్రాంతాల్లోనే తొలుత కొన్నాళ్లు ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేసింది. అనంతరం సర్కారు పట్టించుకోకపోవడంతో ఆ 906 నివాసిత ప్రాంతాల్లో మంచినీటి ప్లాంట్లు నిర్వహణ లేక మూతపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కేవలం 354 నివాసిత ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకం అమలు జరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక, బోర్లు, బావుల్లోని నీటిని తాగడానికి వీలులేక ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు అమ్ముతున్న నీటిలో నాణ్యత గురించి పట్టించుకునే వారే లేకుండాపోయారు. డ్వాక్రా మహిళలకు కన్నీరే మిగిలింది డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూరా తిరుగుతూ హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ, నాలుగున్నరేళ్లుగా పైసాకూడా మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను కన్నీరు పెట్టించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క డ్వాక్రా సంఘాల రుణం మాఫీ చేయలేదని 2018 సెప్టెంబరు 7న మంత్రి పరిటాల సునీత శాసనసభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. డ్వాక్రా మహిళలు సంఘాల పేరిట పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులను అప్పుల కింద బ్యాంకులు జమచేసుకున్నాయి. గతంలో సున్నా వడ్డీ పథకం అమలయ్యేది. చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టాక ఆ పథకానికి నిధులు ఇవ్వడం మానేశారు. దాదాపు రెండేళ్లుగా సున్నా వడ్డీ డబ్బులను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడంతో రూ.2,300 కోట్ల వడ్డీని డ్వాక్రా సంఘాల సభ్యులు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. -
రుణమాఫీ కోసం కదంతొక్కిన రైతన్న
ముంబై: రైతు రుణమాఫీ, అటవీభూములపై గిరిజనులకు హక్కులు, కరువు సాయం కోరుతూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు, గిరిజనులు నిరసనబాట పట్టారు. మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ రాజేంద్రసింగ్ సైతం వీరి వెంట నడిచారు. ప్రధానంగా మరాఠ్వాడా, థానె, భుసావాల్ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, గిరిజనులతో మంగళవారం మధ్యాహ్నం థానెలో ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంబైలోని విధాన్ భవన్‌కు గురువారం చేరుకుని అక్కడ భారీస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రైతులందరికీ అందుబాటులో తగినంత భూమి, నీరు, సహజవనరులన్నీ దక్కాలని సూచించిన స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుచేయాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమంబాట పట్టామని ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న లోక్ సంఘర్‡్ష మోర్చా నేత ప్రతిభాషిండే చెప్పారు. -
రైతు ర్యాలీ.. అర్ధరాత్రి అనుమతి
న్యూఢిల్లీ: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్ర ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం ఈ యాత్రను పోలీసులు ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అడ్డుకున్న విషయం తెలిసిందే. బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులను దేశరాజధాని ఢిల్లీ నగరంలోకి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని ధ్వంసం చేసి ప్రవేశించే యత్నం చేసిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. అయినా కూడా రైతులు వెనకడుగు వేయలేదు. అర్థరాత్రి అయినా వెనక్కి వెళ్లకుండా అక్కడే బస చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో అర్ధరాత్రి బారికేడ్లు తొలిగించి అనుమతించారు. దీంతో రైతులు చేపట్టిన పాదయాత్ర కిసాన్ ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున ముగిసింది. ఈ సందర్భంగా నరేశ్ తికాయత్ మాట్లాడుతూ.. ‘ఇది రైతుల విజయం. బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమైంది. మేం గత 12 రోజులుగా ర్యాలీ చేస్తున్నాం. రైతులంతా అలసిపోయారు. మేం మా డిమాండ్స్, హక్కుల కోసం మా పోరాటం కొనసాగిస్తాం. కానీ ప్రస్తుతం ఈ ర్యాలీని ముగిస్తున్నాం’ అని తెలిపారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతుల ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు. తమ డిమాండ్లను అమలు చేయాలని బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న హరిద్వార్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన సుమారు 70 వేల మంది రైతులు పాల్గొన్నారు. చదవండి: రైతు ర్యాలీ భగ్నం -
ఛలో కిసాన్ ఘాట్
-
రైతు ర్యాలీ భగ్నం
న్యూఢిల్లీ/సేవాగ్రామ్: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తలపెట్టిన కిసాన్ క్రాంతి యాత్రను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రైతుల దాడిలో ఏసీపీ సహా ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న ర్యాలీగా బయలుదేరారు. బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో యూపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే వాటర్ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించి రైతులను చెదరగొట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తమను లాఠీలతో కొట్టారని కొందరు రైతులు ఆరోపించగా పోలీసులు ఖండించారు. బీకేయూ ర్యాలీ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. రోడ్డు పక్కనే రైతుల బస: పోలీసు చర్య అనంతరం రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోనే కిలోమీటర్ మేర మకాం వేశారు. వెంట తెచ్చుకున్న దుస్తులు, దుప్పట్లు వేసుకుని ట్రాక్టర్లు, ట్రాలీల పక్కనే నిద్రకు ఉపక్రమించారు. కొందరు తమ వెంట జనరేటర్లు కూడా తెచ్చుకున్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సుల అమలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ అహింసా దినం రోజున దేశ రాజధానిలో రైతులపై కేంద్రం దాడి చేయించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల డిమాండ్లు ఇవీ.. ♦ చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ♦ ప్రధానమంత్రి మంత్రి ఫసల్ బీమా యోజన పునరుద్ధరించాలి. ♦ పదేళ్లు పాతబడిన డీజిల్ ట్రాక్టర్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాన్ని ఎత్తివేయాలి. ♦ డీజిల్ ధరలను తగ్గించాలి. ♦ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు ♦ 60ఏళ్ల పైబడిన రైతులకు వృద్ధాప్య పింఛను ♦ యూపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలి. యాత్రలో పాల్గొన్న రైతులు: సుమారు 70వేలు ఏయే రాష్ట్రాల రైతులు: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి. ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది: సెప్టెంబర్ 23న హరిద్వార్‌లో -
కిసాన్ ర్యాలీ : ఏడుగురు పోలీసులకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ : డిమాండ్ల సాధనకు దేశ రాజధాని బాట పట్టిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించే క్రమంలో ఢిల్లీ-యూపీ బోర్డర్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఢిల్లీలోకి చొచ్చుకురానీయకుండా నిరోధించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొలగించడంతో పోలీసులు అన్నదాతలను అడ్డుకున్నారు. లాఠీచార్జి, భాష్పవాయుగోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రైతులు, పోలీసుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఓ ఏసీపీ సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బారికేడ్లను తొలగించవద్దని రైతులను కోరినా వారు వినిపించుకోలేదని ట్రాక్టర్లతో బారికేడ్లను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. పోలీసులే ఆందోళనకారులను రెచ్చగొట్టారని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను, వాటర్ కెనాన్లను ప్రయోగించామని పోలీసులు తెలిపారు. రైతులను ఢిల్లీ చేరుకోకుండా నిలువరించేందుకు 3000 మంది పోలీసులను ఢిల్లీ-యూపీ బోర్డర్లో నియమించారు. స్వామినాధన్ కమిషన్ నివేదికను అమటు చేయాలని, రుణమాఫీ ప్రకటించాలని, ఇంధన ధరలు తగ్గించాలనే పలు డిమాండ్లతో రైతులు హరిద్వార్ నుంచి రాజ్‌ఘాట్ వరకూ కిసాన్ క్రాంతి యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. -
రుణమాఫీపై ఎటూ తేల్చని కేంద్ర ప్రభుత్వం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. అయితే రుణ మాఫీ సహా మరికొన్ని డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతులు ప్రభుత్వం ముందుంచిన 11 డిమాండ్లలో ఏడు డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి యుధ్వీర్ సింగ్ మంగళవారం పేర్కొన్నారు. నాలుగు ప్రధాన డిమాండ్లను నెరవేర్చడంపై కేంద్రం తీరు పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం యుధ్వీర్ చెప్పారు. నాలుగు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడినందున వీటిపై తదుపరి సమావేశంలో వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. రుణ మాఫీపై విస్తృతంగా చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించిందన్నారు. కాగా బీకేయూ సారథ్యంలో రైతు సంఘాల పిలుపు మేరకు యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాల నుంచి దాదాపు 70,000 మందికి పైగా రైతులు దేశ రాజధానికి ప్రదర్శనగా తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో రాజ్‌ఘాట్ వరకూ రైతులు బారీ ర్యాలీ నిర్వహించారు. -
అప్పు రూ.2 లక్షల కోట్లు
ఇంతింతై.. అన్నట్టుగా రాష్ట్రం అప్పు అంతకంతకూ పెరిగిపోతోంది. కార్పొరేషన్ల పేరుతో తెస్తున్న రుణాలకు అంతూపొంతూ ఉండటం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన రూ. 70 వేల కోట్ల వారసత్వ అప్పుతో కలుపుకుంటే తెలంగాణ మొత్తం అప్పు సుమారు రూ.2 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు రుణాల వడ్డీ మోతెక్కిపోతోంది. ఈ ఏడాది వడ్డీ కింద ప్రభుత్వం దాదాపు రూ.11,138 కోట్లు చెల్లించనుంది. వ్యవసాయానికి పెట్టుబడి పథకం నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా అప్పులు తప్పేలా లేవు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది! రాష్ట్రం ఏర్పడే నాటికి వారసత్వంగా వచ్చిన రూ.70 వేల కోట్ల అప్పు నాలుగేళ్లలో మూడింతలకు చేరువైంది. మొత్తంగా తెలంగాణ రుణభారం ఇంచుమించు రూ.2 లక్షల కోట్లకు చేరింది. తొలి ఏడాది రూ.9 వేల కోట్ల పైచిలుకుతో మొదలైన రుణ ప్రస్థానం.. రెండో ఏడాది రూ.18 వేల కోట్లు, మూడో ఏడాది రూ.35 వేల కోట్లకు చేరింది. నాలుగో ఏడాది 2017 డిసెంబర్ నాటికే రూ.24 వేల కోట్ల రుణం తీసుకుంది. దీంతో వారసత్వంగా వచ్చిన అప్పుతో కలిపి మొత్తం అప్పు సుమారు రూ.1.56 లక్షల కోట్లకు చేరింది. వీటికి తోడు విద్యుదుత్పత్తి, పంపిణీని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకంలో చేరడంతో రూ.8,923 కోట్ల డిస్కంల అప్పు ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయింది. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చేందుకు ముందునుంచీ ప్రభుత్వం ఉత్సాహం చూపడంతో రుణభారం తడిసి మోపెడైంది. ఈ ఏడాది మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, డబుల్ బెడ్రూం ఇళ్లకు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.65 వేల కోట్ల అప్పులు తీసుకుంది. వీటిలో కొన్నింటిని ఖర్చు చేయగా.. ఇంకొన్ని మంజూరు దశలో ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.2 లక్షల కోట్లకు చేరింది. కార్పొరేషన్ల పేరుతో.. కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణను గుర్తించిన కేంద్రం గతేడాది మరో 0.25 శాతం రుణ సమీ కరణకు వెసులుబాటు కల్పించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.26 వేల కోట్ల మేర అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను విక్రయించింది. వీటితోపాటు కార్పొరేషన్ల పేరుతో అదనంగా తెచ్చిన అప్పులు పెరిగాయి. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభు త్వం.. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చింది. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. తొలిసారిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ అథారిటీ ఈ కోవలోనివే. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌కు ఈ ఏడాది రూ.24 వేల కోట్లు అప్పు తెచ్చింది. కొత్తగా తుపాకులగూడెం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు రుణాలు తెచ్చేందుకు దేవాదుల కార్పొరేషన్ ఏర్పాటుకు ఫైల్ సిద్ధం చేసింది. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథకు రూ.44 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని లెక్కలేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు బడ్జెట్ నుంచి ఈ పథకానికి నిధులను కేటాయించలేదు. బడ్జెటేతర నిధులు తెస్తున్నామంటూ అప్పులతోనే 90 శాతం పనులు పూర్తి చేసింది. చివరి ఏడాది రుణ సంస్థలకు ప్రభుత్వ వాటా చెల్లించాల్సి ఉంటు ందని, దీంతో వచ్చే ఏడాది మిషన్ భగీరథ నిధుల సమీకరణ ఇబ్బందిగా మారుతుందన్న అభిప్రాయాలున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా హడ్కో ద్వారా దాదాపు రూ.10 వేల కోట్ల రుణం తీసుకుంది. కార్పొరేషన్ల పేరుతో రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాకే ముప్పు వస్తుం దని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణం ఖర్చు చేయటమే తప్ప.. పన్నులు, బిల్లుల రూపంలో ప్రభుత్వానికి తిరిగి వచ్చేదేమీ ఉండదని అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్ రుణాలకు పూచీకత్తు ఇచ్చినందుకు వీటన్నింటినీ భవిష్యత్తులో ప్రభుత్వమే తిరిగి కట్టాల్సిన పరిస్థితి తలెత్తనుంది. వడ్డీల మోత.. ఇప్పటిదాకా చేసిన అప్పులు, వాటిపై వడ్డీలకు ప్రభుత్వం ఏటా రుణ వాయిదాలు చెల్లిస్తోంది. ఈ ఏడాది దాదాపు రూ.11,138 కోట్ల రుణ వాయిదాలు చెల్లించనుంది. తొలి నాలుగేళ్లలో రైతుల రుణమాఫీకి నిధుల్ని సమీకరించేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం.. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయ పెట్టుబడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఏటా దాదాపు రూ.12 వేల కోట్ల నిధులు ఈ పథకానికి అవసరం కావటంతో వచ్చే ఏడాది సైతం అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. -
ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పారంటూ...
సాక్షి, న్యూఢిల్లీ : రుణ మాఫీపై ఆర్బీఐ మాజీ గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రస్తావించడం ఆసక్తి రేపింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు రుణ మాఫీ హామీలివ్వడం సరైంది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడాన్ని జైట్లీ ప్రస్తావించారు. రుణ మాఫీ వాగ్ధానాలతో లబ్దిదారులు రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నా చెల్లించేందుకు ముందుకురారరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి పేర్కొన్నారు. ఈ పరిణామం బ్యాంకింగ్ రంగంతో పాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారన్నారు. అయితే ఈసీకి రాజకీయ పార్టీల రుణ మాఫీ హామీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ పేరునూ, ఆయన ఎప్పుడు ఈ లేఖ రాశారనే వివరాలను జైట్లీ వెల్లడించలేదు. నాబార్డ్, సిడ్బీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులోనూ ఆర్బీఐ మాజీ గవర్నర్ రుణ మాఫీలు, సబ్సిడీలు పరపతి వ్యవస్థను దెబ్బతీసాయని ఆందోళన వ్యక్తం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ అభిప్రాయం గురించి ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణ దుమారం రేపుతోంది. రైతు రుణమాఫీపై అసలు ప్రభుత్వ ఉద్దేశమేంటనేది జైట్లీ వివరణ ఇవ్వకపోవడం పలు సందేహాలను ముందుకు తెస్తోంది. గతంలోనూ ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ దిగ్గజాలు వ్యవసాయ రుణాల మాఫీపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడంపై ఆందోళన నెలకొంది. -
కాంగ్రెస్ ‘ఆకర్ష్’ మంత్ర..!
► నిరుద్యోగులకు రూ.3వేలు.. రైతుల రుణమాఫీ రూ.2 లక్షలు ► వికలాంగులకు రూ.2,500 ► ఎన్నికల వరాలను సిద్ధం చేస్తున్న టీపీసీసీ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో వివిధ వర్గాల ప్రజలను ఆకర్షించడానికి అనుసరిం చాల్సిన పథకాలు, ప్రకటనలు, హామీలపై టీపీసీసీ భారీగా కసరత్తు చేస్తోంది. టీపీసీసీ ముఖ్యనేతలు ప్రజాకర్షక పథకాలపై వివిధ వర్గాల నిపుణులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సంఘాలతో ఆంతరంగిక చర్చలు జరుపుతు న్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నారు. తెలంగాణరాష్ట్రంలో నినాదాలుగా ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించారు. నియామకాల విషయంలో యువతలో ఉన్న అసంతృప్తిని టీఆర్ఎస్ పట్టించుకోవడంలేదని, ప్రభుత్వశాఖల్లోనూ, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఖాళీలను భర్తీ చేయకుండా చేస్తున్న నిర్లక్ష్యాన్ని తనకు అను కూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. నిరుద్యోగులకు భృతి.. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉద్యోగం లేదా ఉపాధి దొరికే వరకూ భృతిని అందిం చాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డిగ్రీ పూర్తి చేసిన యువతకు నెలకు రూ.3వేలు భృతిగా ఇవ్వనుంది. దాదాపు 10 లక్షల మంది డిగ్రీ పూర్తిచేసిన వారుంటారని టీపీసీసీ అంచనా. ఇందుకు నెలకు రూ.3వేల కోట్లు, ఏడాదికి రూ.36వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుం దని భావిస్తోంది. దీనిపై మరింత అధ్య యనం చేయనుంది. అందుకే నిరుద్యోగభృతి ఇస్తామన్నా... నెలకు ఎంతన్నది టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించలేదు. రైతులకు భరోసా... ఇక రైతులను ఆకర్షించేందుకు రుణమాఫీని మరింత వెసులుబాటుతో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రణాళిక. దీన్ని కేవలం పంటరుణాలకే పరిమితం చేయకుండా టర్మ్ లోన్‌కు కూడా రూ.2లక్షల దాకా రుణామాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించనుంది. దీనిపై దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓ నిర్ణయం తీసుకుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో 2లక్షల వరకూ అన్ని రుణాలను మాఫీ చేయాలని టీపీసీసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రైతులకు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు వంటి కనీస అవసరాలకోసం ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది.రైతులకు ఎకరానికి ఎంత ఇవ్వాలనే దానిపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనతో కాంగ్రెస్‌లో అంతర్గ తంగా నేతలపై పరస్పర అనుమానాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. పింఛను పరం గా వితంతువులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్న రూ.1,000ని రెట్టింపు చేసి 2,000 ఇవ్వనుంది. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే వికలాంగులకు ఇస్తున్న రూ.1,500కు బదులు రూ.2,500 ఇవ్వాలని నిర్ణయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరంగా అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా మరోగదిని ఇస్తామని గతంలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మహిళలకు, విద్యార్థులకు, పాడి రైతులకు ప్రత్యేకంగా పలు వరాలను ప్రకటించడానికి టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. -
రైతు రుణాల మాఫీ సరి కాదు
► నైతికత ప్రమాదంలో పడుతుంది ► నాబార్డ్ చైర్మన్ హర్ష కుమార్ భన్వాలా ముంబై: రైతుల రుణాల మాఫీ సరికాదని, దీంతో నైతికత ప్రమాదంలో పడుతుందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)చైర్మన్ హర్ష కుమార్ భన్వాలా వ్యాఖ్యానించారు. గంపగుత్తగా రైతులందరికీ రుణ మాఫీ చేయడం కాకుండా.. అవసరమైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు కల్పించవచ్చని ఆయన చెప్పారు. ‘రుణాల చెల్లింపు కోణం నుంచి చూస్తే రుణ మాఫీలనేవి నైతికతకు ప్రమాదకరం. అందరికీ మాఫీ చేసేయడం సరికాదు‘ అనిహర్ష కుమార్ అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.36,000 కోట్ల మేర రైతు రుణ మాఫీ ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కూడా ఇటువంటి ప్యాకేజీలపై విముఖత వ్యక్తం చేయటం తెలిసిందే. తమిళనాడు, హరియాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా రుణాల మాఫీ డిమాండ్లు వస్తుండటంతో.. ఈ తరహా పథకాల వల్ల తలెత్తే నైతిక సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భన్వాలా చెప్పారు. అవసరమున్న రైతులకు మాత్రమే ఇలాంటి స్కీములను వర్తింపచేయడం మంచిదన్నారు. పన్నుల చెల్లింపుదారుల సొమ్మును రుణాల మాఫీ పథకాలకు మళ్లించడం సరికాదని భన్వాలా అభిప్రాయపడ్డారు. రుణ వితరణ లక్ష్యం అధిగమిస్తాం.. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన రూ. 9 లక్షల కోట్ల అగ్రి లోన్స్ లక్ష్యాన్ని ఆర్థిక సంస్థలు అధిగమించగలవని భన్వాలా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్ల టార్గెట్‌ను దాటగలవన్నారు. దీర్ఘకాలిక సాగు నిధిపై నాబార్డ్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని.. ఇందులో భాగంగా నిర్ధిష్ట ప్రాజెక్టులకు రూ. 25,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నదని భన్వాలా పేర్కొన్నారు. ఈ ఏడాది సూక్ష్మ–సాగు రంగంపై రూ. 2,000 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. తమ మొత్తం లోన్ బుక్‌లో దీర్ఘకాలిక రుణాల పరిమాణం రెండేళ్ల క్రితం 19 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 24 శాతానికి ఎగిసిందని భన్వాలా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో వెయ్యి మంది పైగా రైతులున్న పది గ్రామాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇక పెద్ద నోట్ల రద్దు తొలినాళ్లలో రీపేమెంట్లు ఒక్కసారిగా పెరిగాయని, ఆ తర్వాత రుణాలకు డిమాండ్ తగ్గిందని చెప్పారు. అయినప్పటికీ నిర్దేశిత రూ. 9 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. -
‘రుణమాఫీతో 2 కోట్ల రైతులకు లబ్ధి’
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తర్వలో అమలుచేయనున్న రుణమాఫీతో దాదాపు 2 కోట్ల చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ సహాయ్ వెల్లడించారు. ప్రస్తుతం రుణమాఫీ విధివిధానాలపై తమ సర్కారు పనిచేస్తోందని ఆయన తెలిపారు. చాలా మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదనీ, ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని సహాయ్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ కల్లా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మార్కెట్లను జాతీయ ఆన్లైన్ వ్యవసాయ మార్కెట్ ఈ–మండీకి అనుసంధానం చేస్తామని ప్రకటించారు. దీనివల్ల కొనుగోలు, అమ్మకాల్లో పారదర్శకత పెరగుతుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వ్యాపారులకు రూ.లక్షగా ఉన్న లైసెన్స్ ఫీజును తగ్గిస్తామని సహాయ్ హమీనిచ్చారు. 2017–18 ఏడాదికి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని వెల్లడించారు. జూన్‌కల్లా దాదాపు 75 లక్షల సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలతో పాటు వ్యవసాయ పనిముట్లను అందించడంలో పారదర్శకత పాటిస్తామన్నారు. 2017–18 ఏడాదికి బుందేల్‌ఖండ్ ప్రాంతంలో దాదాపు 2,000 చెరువులు తవ్వే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సహాయ్ ప్రకటించారు.