శని, ఆదివారాల్లో సెలవుల దృష్ట్యా ధర్మపురికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. దీంతో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ధర్మపురిలో పుష్కరాల పర్యవేక్షకులుగా మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్‌రావులను నియమించారు.
ఈ మేరకు వీరిద్దరు శని, ఆదివారాల్లో ధర్మపురిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పుష్కరాలపై సమీక్షలు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.
ధర్మపురిలో మంత్రుల మకాం
Published Sat, Jul 18 2015 1:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement