YSR Bima: నేడు వైఎస్సార్‌ బీమా లబ్ధిదారులకు ఆర్థిక సాయం | Financial assistance to YSR Bheema beneficiaries today | Sakshi
Sakshi News home page

YSR Bima: నేడు వైఎస్సార్‌ బీమా లబ్ధిదారులకు ఆర్థిక సాయం

Published Wed, Mar 31 2021 5:14 AM | Last Updated on Sun, Oct 17 2021 3:56 PM

Financial assistance to YSR Bheema beneficiaries today - Sakshi

సాక్షి, అమరావతి: అనుకోని విపత్తుగా ఇంటి పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారికి కూడా బీమా సొమ్మును చెల్లించడానికి సీఎం మానవతాదృక్పథంతో నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు 2020 అక్టోబర్‌ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 254 కోట్లు చెల్లించనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement