MLC Kavita Financial Help For Nanded MBBS Student Harika, Details Inside - Sakshi
Sakshi News home page

గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. విద్యార్థిని హారికకు గొప్ప సాయం!  

Published Wed, Nov 9 2022 12:53 PM | Last Updated on Wed, Nov 9 2022 3:16 PM

MLC Kavita Financial Help For MBBS Student Harika - Sakshi

హైదరాబాద్: చదువుల తల్లి హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లాలోని నాందేవ్ గూడకు చెందిన హారికకు కవిత అండగా నిలిచారు.

ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి  కవిత ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని భరోసానిచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో  అందించారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించారని తెలిపారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హారిక ఎంబీబీఎస్‌లో రాణించి, వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కవిత తన చదువుకు ఆర్థికంగా  అండగా నిలిచినందుకుగాను హారిక తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కు అందుకుంటున్న సమయంలో భావోద్వాగానికి లోనయ్యారు. తాను బాగా చదువుకొని కవిత సూచించినట్లుగా సమాజానికి తోడ్పాటునందిస్తానని హారిక అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement