
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వైఎస్సార్ రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందచేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం 9 మంది బాధితుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి. సృజన తన కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు.
ఆర్థిక సహాయం అందుకున్న వారు..
K.సావిత్రి భర్త వెంకట్రాముడు
1. పత్తికొండ మండలం పత్తికొండ గ్రామానికి చెందిన కె.సావిత్రికి ఎనిమిది నెలల నుంచి గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకున్నారు.
T. నరసింహులు
2. కౌతాళ మండలం తోవి గ్రామం చెందిన టి నరసింహులు తను పేదరికంతో ఉన్నానని, కుమారునికి అనారోగ్య కారణంగా వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు.
మెహరున్నీసా
3. కర్నూలు నగరానికి చెందిన మెహరున్నీసా తన కుమార్తెకు కిడ్నీ సమస్య ఉందని, అలాగే తన కుమార్తె చదువుకు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తన సమస్యను విన్నవించుకున్నారు.
దిలీప్ కుమార్ రెడ్డి
4.మద్దికెర మండలం, గురజాల గ్రామం చెందిన పి. దిలీప్ కుమార్ రెడ్డి తాను తలసేమియా వ్యాధితో బాధపడుతున్నానని, నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించుకోవలసి వస్తుందని,. ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక సోమత లేక ఇబ్బందులు పడుతున్నానని తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు.
బోయ నరసింహులు
5. నందవరం మండలం, సోమల గూడూరు గ్రామం చెందిన బోయ నర్సింహులు తనకు కుడి కాలు, కుడి చేయి పని చేయడం లేదని, తనకు ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.
K.రంగమ్మ
6. పత్తికొండ మండలం, నక్కల దొడ్డి గ్రామానికి చెందిన కె.రంగమ్మ వికలాంగత్వంతో ఉన్న తన కుమార్తెకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్‌కు విన్నవించుకున్నారు.
P. ఈరన్న సోదరుడు
7.ఆలూరు మండలం, కోటవీధికి చెందిన పి. చిదానందం తన కుమారుడు ఈరన్నకు కడుపునొప్పి సమస్య ఉందని, ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.
కురువ లక్ష్మి
8. ఆదోని మండలం, ఆదోని గ్రామానికి చెందిన కురవ లక్ష్మి తన కుమార్తెలు ఇరువురికి సరిగా చూపు కనపడక అందత్వంతో బాధపడుతున్నారని సీఎం జగన్‌కు విన్నవించుకున్నారు.
L.మహేష్
9. పత్తికొండ మండలం, పత్తికొండ గ్రామం ఎల్ మహేష్ తన కుమార్తె మూగ మరియు చెవిటి బాధతో ఇబ్బంది పడుతుందని తనను ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.
తమ సమస్యలను విని మానవతా దృక్పథంతో ఇంత తొందరగా ఆర్థిక సహాయం అందజేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్‌కు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment