భానుతేజ సమస్యను వింటున్న సీఎం
ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఆర్థిక సహాయం కోరుతూ బాధితులు వినతులు అందించగా.. వారికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాధితులు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పలువురు అర్జీలు సమర్పించి తమ సమస్యలు చెప్పుకున్నారని తెలిపారు. సమస్యలు విన్న సీఎం తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఇద్దరికి రూ. 2 లక్షలు చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాగా, సీఎం చేసిన సహాయానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ కష్టాలను చెప్పుకున్న వెంటనే అర్థం చేసుకొని తక్షణమే స్పందించి సహాయం చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు.
సహాయం అందుకున్న వారు..
► విస్సన్నపేట మండలం, నరసాపురం గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మి, శ్రీనివాసరావు దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు భానుతేజ కేన్సర్‌తో బాధపడుతున్నాడని.. చికిత్స అవసరాల నిమిత్తం సాయం చేయాలంటూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ. 2 లక్షలు సహాయాన్ని అందించారు.
► విజయవాడ, అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన 31 ఏళ్ల కంబా ఏడుకొండలు.. ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయానని.. తనకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా రూ.2 లక్షలు సహాయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment