
మృతుని కుటుంబంతో మాట్లాడుతున్న ఈటల
మర్కూక్(గజ్వేల్): ఫామ్‌హౌస్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోతే సీఎం ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బావిలో పడి మృతిచెందిన మర్కూక్ మండలం వరదరాజుపూర్ గ్రామానికి చెందిన రెడ్డమైన ఆంజనేయులు కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. ఆంజనేయులు మృతిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని, రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. తన వ్యవసాయ క్షేత్రంలో చనిపోయిన కూలీకి రూ.50 వేలు అందజేసి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆంజనేయులు చనిపోతే అతడి కుటుంబ సభ్యులను రాత్రంతా వ్యవసాయ క్షేత్రంలో ఉంచుకోవడమేంటని ప్రశ్నిం చారు. ఆంజనేయులు కుటుంబానికి భరోసా కల్పించకపోవడం విడ్డూరంగా ఉందని, సీఏం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment