
సాక్షి, తిరుమల : ప్రముఖ గాయని పద్మశ్రీ శోభారాజు టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. టీటీడీలో పాటలు పాడే అవకాశాన్ని తనకు ఇవ్వాలని శోభారాజు కోరారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ)లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. నలభై ఏళ్లుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నా.. టీటీడీ నుంచి సరైన గుర్తింపు లభించలేదని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ తనకు ప్రకటించిన ఆస్థాన విద్వాంసురాలు పదవి కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో తన సేవలను ఉపయోగించుకుంటామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు శోభారాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment