ఏమో... ఎవరికి తెలుసు? | LG Kiran Bedi's another inspirational act | Sakshi
Sakshi News home page

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కుర్చీలో బాలుడు

Published Mon, Oct 30 2017 8:04 AM | Last Updated on Mon, Oct 30 2017 8:04 AM

LG Kiran Bedi's another inspirational act

పుదుచెర్రీ : మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచెర్రీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ బాలుడికి అప్యాయ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా గవర్నర్‌ కుర్చీలోనే అతన్ని కూర్చోబెట్టారు.

రాజ్‌ నివాస్‌(పుదుచ్చేరి రాజ్‌ భవన్‌)కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్‌ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులతో వెళ్లి ఆమెను కలిశారు. వారితో కాసేపు మాట్లాడిన బేడీ, బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. 

ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతానని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘ఏమో దీనిని స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే ఈ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?’’అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement