న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత,ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది.లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకుగాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనుమతిచ్చినట్లు సమాచారం. దీంతో లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ప్రత్యేక కోర్టు విచారణకు ఇక లైన్ క్లియరవనుంది.
సీఆర్పీసీ ప్రకారం పబ్లిక్ సర్వెంట్‌లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా కావాలి అయితే ఈడీ కేసుల్లో మాత్రం ఈ అనుమతి గతంలో అవసరం లేదు. తాజాగా నవంబర్ 6వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్‌లను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. దీంతో ఈడీ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ అనుమతి కోరింది.
కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే. బయటికి వచ్చిన తర్వాత ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలుండడంతో ప్రస్తుతం ఆయన వాటిపైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎన్నికల కోసం ఆప్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment