అచ్చే దిన్.. ఎక్కడ?
జగిత్యాల: పెద్ద నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో అచ్చే దిన్ వస్తాయని ప్రధానమంత్రి మోదీ చెప్పినప్పటికీ అలాంటిదేమీ కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది. ఏటీఎంలు పనిచేయక, డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుకు డబ్బులు వచ్చాయని తెలియగానే మల్లాపూర్ ప్రజలు ఆ బ్యాంకు ముందు బారులు తీరారు. ఆ దృశ్యం చూస్తుంటే నగదు కొరత ఎంత ఉందో అర్థమవుతోంది. మహిళలు, రైతులు ఎక్కువగా క్యూ లైన్లలో కనిపిస్తున్నారు.