లభ్యమైన సూసైడ్ నోట్
టెక్కలి రూరల్ : టెక్కలి పట్టణంలోS అమర్‌నా«ద్ లాడ్జిలో పనపాన విశ్వనాధం(35) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు బాధ తాళలేకే ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన విశ్వనాధం గ్రామంలో సుమారు రూ.4లక్షల వరకు పలువురు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకున్నాడు. వీటిని తీర్చలేక అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తను రాసిన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఆ నోట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం తాను ఆరుగురి నుంచి అప్పులు తీసుకున్నానని వారు ఎవరూ తనను వేధించనప్పటికీ బొడ్డు చిట్టమ్మ అల్లుడు చింత లక్ష్మణ్ తానిస్తున్న డబ్బులు తీసుకుంటూనే తన కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని, నిత్యం ఫోన్‌లో వేధిస్తున్నాడని ఆ వేధింపులు భరించలేకే ఆత్మహతయ చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన రాత్రి రెంగు గంటల సమయంలో లాడ్జిలో దిగిన వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్‌ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని అతని మెుబైల్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేమాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.