సాక్షి, ములుగు: జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వెంకటాపురం మండలంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలోనే ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ఈ మేరకు వాజేడు ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు.
వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గోపాల్ ఇంట్లో ఉన్న సమయంలో ఐదుగురు అనుమానితులు రావడంతో వారిని గమనించిన గోపాల్ బయటికి పరుగెత్తగా వెంబడించి పట్టుకున్నారు. గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి చంపేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న గోపాల్ మృతి చెందినట్లు నిర్ధారించుకుని లాల్‌సలామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ గా వ్యవహరించడంతోనే హత్య చేసినట్లు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు.
మరోవైపు.. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్‌కౌంటర్ల పేరుతో చాలా మందిని కాల్చి చంపారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించే వారు పద్దతి మార్చకోకుంటే ప్రజా కోర్టు శిక్ష తప్పదని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 20 రోజుల క్రితం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పర్యటించి పోలీసులను అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఇలా హత్య జరగడం ఏజెన్సీలో కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment