
వాజేడు: కుక్కను తప్పించబోయి కారు కాల్వలో పడటంతో ఐదుగురు పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బొగత జలపాతం చూడటానికి హైదరాబాద్ నుంచి కారులో పర్యాటకులు వచ్చారు.
బొగత జలపాతాన్ని చూసి తిరిగి వెళ్తుండగా మండల పరిధిలోని దూలాపురం గ్రామం వద్ద వారి కారుకు కుక్క ఎదురొచ్చింది. దీంతో దాన్ని తప్పించడానికి కారును పక్కకు తిప్పడంతో అదుపుతప్పి సమీపంలోని కాల్వలో బోల్తాపడింది. స్థానికులు గమనించి బోల్తాపడిన కారులో ఉన్నవారిని బయటకు తీశారు.