
సాక్షి, గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్ సమీపంలోని గొత్తికోయగూడెంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వారు కట్టుబట్టలతో మిగిలిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క శుక్రవారం అక్కడకు వెళ్లారు. రహదారి లేకపోవడంతో తలపై నిత్యావసర సరుకులు మోసుకుంటూ తీసుకెళ్లారు. బాధితులకు బియ్యం, దుప్పట్లు, వంట పాత్రలు అందజేసి భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment