
సాక్షి, వరంగల్ : సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసే ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా కబడ్డీ ఆడారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో శుక్రవారం ‘ఎంటర్‌టైన్‌మెంట్ డే’ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టుదలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఆకాక్షించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు. ఇక ఎమ్మెల్యే కబడ్డీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment