ములుగు జిల్లా సాధనకు నిరవధిక నిరాహార దీక్ష
Published Sat, Aug 20 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
ములుగు : ములుగును జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్ మండల కేంద్రంలోని గాంధీచౌక్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల బిక్షపతి పూల మాల వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, బిక్షపతి మాట్లాడుతూ జిల్లా సాధనకు ప్రాణాలను లెక్కచేయకుండా దీక్షకు కూర్చోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జిల్లా ప్రకటించాలని కోరారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీక్ష విరమించేది లేదని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, నాయకులు దూడబోయిన శ్రీనివాస్, బాబాఖాన్, గుండెమీది వెంకటేశ్వర్లు, దేవదాసు, శ్యాం, ప్రవీణ్, హరి, బాబి, షర్పోద్దీన్, అజయ్, రవిపాల్, వంగ రవియాదవ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement