సాక్షి,ములుగు(వాజేడు): వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గుట్టలెక్కి వెళ్లి గిరిజనులకు శనివారం కరోనా టీకాలను వేశారు. మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు కుగ్రామం గుట్టలపై ఉంది. ఏటూరునాగారం ఐటీడిఏ అడిషనల్ డీఎం హెచ్‌ఓ మంకిడి వెంకటేశ్వర్లు, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చిన్న వెంకటేశ్వర్లు, అరుణ కుమారి పెనుగోలు గిరిజనుల సహకారంతో కిట్లను మోసుకుంటూ 15 కిలో మీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్లారు.
దారిలో కలిసిన ఒక్కరిద్దరికి టీకాలను సైతం వేసి గ్రామానికి చేరుకుని టీకాలను వేశారు. అనంతరం అందరి నుంచి రక్త నమూనాలను సేకరించారు.
చదవండి: హాస్టల్‌లో ఏదో ఉందని! ఒంటిపై రక్కుతున్నట్లు, తమను లాగుతున్నట్లు అనిపిస్తోందని..
Comments
Please login to add a commentAdd a comment