
సాక్షి, ములుగు: భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా.. డీజీపీ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఉదయం నుంచి ఏడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై పోలీసులు, నిఘావ్యవస్థను అప్రమత్తం చేస్తూ సూచనలు ఇచ్చారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 2020లో మేడారం జాతర ఏర్పాట్లు, వీఐపీల భద్రతపై డీజీపీ ఈ అంతర్గత సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్, మూడు జిల్లాల ఎస్పీలు, ఆరు జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment