
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇటీవల ప్రవీణ్‌కుమార్‌ను ఉరి తీస్తామని ఒకరు, ఖతం చేయాలని మరొకరు అంటున్నారని, అయితే, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజులు, గట్టమ్మ తల్లి తన వెంట ఉన్నందున ఎవరూ ఏమీ చేయలేరని స్వేరోస్ ఫౌండర్, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం రాత్రి నిర్వహించిన స్వేరోస్ జ్ఞాన గర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
సమ్మక్క సారలమ్మల చరిత్రను భావితరాలకు తెలియకుండా చేయడంతో పాటు, చరిత్రలో లేకుండా వారికి వెన్నుపోటు పొడిచారని, వారి అంశగా ఉన్న ములుగు ప్రాంతబిడ్డలు గొప్పగా చదువుకుంటుంటే మళ్లీ వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రవీణ్‌కుమార్ మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించి, గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు.
( చదవండి: వెలుగులు నింపే ‘చెత్త’.. ఛీ అని తీసిపారేయకండి.. )