
ములుగు: జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో యాత్రికుల బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. అయితే బస్సులో 40 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. గుండెపోటుకు గురైన డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి ప్రైవేటు బస్సులో బయలుదేరిన భవాని దీక్ష భక్తులు.. భద్రాచలం మీదుగా యాదగిరిగుట్ట వెళ్తుండగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం వద్ద డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment