
సాధారణంగా చిన్నపిల్లలు పాకుతూ నాణేలను, చిన్న చిన్న వస్తువులను మింగడం తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మరీ వింత వింతగా ఏది పడితే అది తినేస్తున్నారు. ఇసుక, మట్టి, వెంట్రుకలు, రాళ్లను కరకరా నమిలేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా మొబైల్ ఫోన్ మింగేసాడు. ఈ విచిత్ర సంఘటన ఈజిప్ట్ దేశంలో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పితో ఓ వ్యక్తి ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. అయితే వైద్యులు అతని కడుపుని ఎక్క్‌రే తీసి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పేషెండ్ కడుపులో మొబైల్ ఫోన్ కనిపించడంతో వైద్యులకు మైండ్ బ్లాంక్ అయ్యింది.
చదవండి: వైరల్: అభివృద్ధి అన్నందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే
కాగా ఆరు నెలల క్రితం అతను పొరపాటున ఫోన్‌ను మింగిన్నట్లు వైద్యులకు తెలిసింది. అయితే కడపులో నుంచి ఫోన్ సహజంగా బయటకు వస్తుందని ఆ యువకుడు భావించాడు కానీ అది జరగలేదు. మొబైల్ కడుపులో ఇరుక్కొని ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈజిప్టులోని అస్వాన్ నగరంలోని ఆసుపత్రిలో అతనికి ఆపరేషన్ చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోగా.. బ్యాటరీ అతని కడుపులో పేలిపోతుందని వైద్యులు కంగారు పడ్డారు. కానీ చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి సురక్షితంగా బయటపట్టాడు.
చదవండి: వైరల్: ఒక్క క్షణం ఆలస్యమైతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమయ్యేదో !