పాములు, మొసళ్లు, బల్లులు వంటి కొన్ని సరీసృపాలకు మానవుడి తప్పిదాలు వాటికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. బీచ్‌ల వద్ద, నదుల వద్ద పెద్ద ఎత్తున్న ప్లాస్టిక్ వంటి చెత్తచెదారాలను వేసేస్తాం. పాపం ఈ జంతువులు ఏదో ఆహారంగా బావించి తినడం వంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడొక పాము కూడా అలానే చేసింది. ఏకంగా గోల్ఫ్ బంతులను కోడి గుడ్డుగా బావించి మింగి నరకయాతన అనుభవించింది.
వివరాల్లోకెళ్తే....ఇక్కడొక పాము గోల్ఫ్ బంతులను కోడి గుడ్లనుకుని మింగేసేందుకు ప్రయత్నించింది. ఐతే అవి ఆ పాము శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. దీంతో పాము నరకయాతన అనుభవించింది. ఈ ఘటన నార్త్ కొలరాడో వైల్డ్ లైఫ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ వైల్డ్‌లైఫ్ సెంటర్ అధికారులు స్నేక్ రెస్క్యూ బృందాని పిలిపించారు.
ఆ బృందం అసలు విషయం తెలుసుకుని ఆ స్నేక్‌కి సాయం చేశారు. ఆ పాముకి శస్త్ర చికిత్స చేయకుండానే ఆ బంతులను తీసేశారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి ఆ పాము శరీరం నుంచి ఆ బంతులను వేరు చేశారు. ప్రస్తుతం ఆ పాము చిన్నపాటి గాయాలతో సురక్షితంగానే ఉంది. ఐతే ఈ పాము చాలా ఆకలిగా ఉండటంతో ఆ గోల్ఫ్ బంతులను చూసి కోడి గుడ్లుగా భ్రమపడి మింగేసిందని వైద్యులు చెబుతన్నారు.
(చదవండి: ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment