Balls
-
మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..!
కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 15 లేదా 20 (నలువైపులా కట్ చేసి.. పాలలో ఒకసారి ముంచి.. చేతులతో గట్టిగా ఒత్తుకుని, విడిపోకుండా చపాతీకర్రతో చపాతీల్లా ఒత్తుకుని పక్కనపెట్టుకోవాలి) మటన్ కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని ఉడికించుకుని, చల్లారనివ్వాలి) బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించి, ముద్దలా చేసుకోవాలి) వాము పొడి, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత, బ్రెడ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లపైనే నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికిన కీమా, జీలకర్రపొడి, గరం మసాలా, వాము పొడి, ఆమ్చూర్ పొడి, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తరుగు, బంగాళదుంప గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అనంతరం చిన్నచిన్నబాల్స్లా చేసుకుని ఒక్కో బ్రెడ్ ముక్కలో ఒక్కో ఉండ పెట్టి.. గుండ్రంగా బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం ఆ ఉండలను పాలల్లో ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. నచ్చిన కూరగాయల తురుముతో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బాల్స్. ఇవి చదవండి: ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..! -
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
గోల్ఫ్ బంతులను మింగిన పాము: ఫోటోలు వైరల్
పాములు, మొసళ్లు, బల్లులు వంటి కొన్ని సరీసృపాలకు మానవుడి తప్పిదాలు వాటికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. బీచ్‌ల వద్ద, నదుల వద్ద పెద్ద ఎత్తున్న ప్లాస్టిక్ వంటి చెత్తచెదారాలను వేసేస్తాం. పాపం ఈ జంతువులు ఏదో ఆహారంగా బావించి తినడం వంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. ఇక్కడొక పాము కూడా అలానే చేసింది. ఏకంగా గోల్ఫ్ బంతులను కోడి గుడ్డుగా బావించి మింగి నరకయాతన అనుభవించింది. వివరాల్లోకెళ్తే....ఇక్కడొక పాము గోల్ఫ్ బంతులను కోడి గుడ్లనుకుని మింగేసేందుకు ప్రయత్నించింది. ఐతే అవి ఆ పాము శరీరంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. దీంతో పాము నరకయాతన అనుభవించింది. ఈ ఘటన నార్త్ కొలరాడో వైల్డ్ లైఫ్ సెంటర్లో చోటు చేసుకుంది. దీంతో ఆ వైల్డ్‌లైఫ్ సెంటర్ అధికారులు స్నేక్ రెస్క్యూ బృందాని పిలిపించారు. ఆ బృందం అసలు విషయం తెలుసుకుని ఆ స్నేక్‌కి సాయం చేశారు. ఆ పాముకి శస్త్ర చికిత్స చేయకుండానే ఆ బంతులను తీసేశారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి ఆ పాము శరీరం నుంచి ఆ బంతులను వేరు చేశారు. ప్రస్తుతం ఆ పాము చిన్నపాటి గాయాలతో సురక్షితంగానే ఉంది. ఐతే ఈ పాము చాలా ఆకలిగా ఉండటంతో ఆ గోల్ఫ్ బంతులను చూసి కోడి గుడ్లుగా భ్రమపడి మింగేసిందని వైద్యులు చెబుతన్నారు. (చదవండి: ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు: వీడియో వైరల్) -
ప్రయోగం చేశాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
నేటి తరం పిల్లలు ఒక పట్టాన ఏదీ నమ్మరు. స్వయంగా తమంతట తాము స్వయంగా తెల్సుకుంటేగాని ఒక నిర్ణయానికి రారు. ఈ కోవకు చెందిన వాడే మనం చెప్పుకోబోయే చిచ్చరపిడుగు రిలేమోరిసన్. ఇంగ్లాండ్‌లోని గ్రేట్ మాంచెస్టర్‌కు చెందిన 12 ఏళ్ల మోరిసన్ 54 మ్యాగ్నటిక్ బాల్స్ మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని లె లుసుకున్న మోరిసన్ .. మాగ్నెట్‌తో తయారు చేసిన బాల్స్‌ను మింగితే.. తన పొట్ట అయస్కాంతంలా పనిచేస్తుందని అనుకున్నాడు. అసలు అది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునేందుకు జనవరి 1న కొన్ని బాల్స్, నాలుగున... కొన్ని... మొత్తం 54 మ్యాగ్నటిక్ బాల్స్‌ను మింగేసాడు. మింగిన తరువాత ఒక ఐరన్ స్టిక్‌ను తన పొట్ట మీద ఉంచాడు. ఎంతకీ అది అయస్కాంతానికి ఆతుక్కోక పోవడంతో.. తాను మింగిన బాల్స్ టాయిలెట్లో పడిపోయాయేమోనని వాష్‌రూమ్‌కు వెళ్లి చూశాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కంగారుపడిపోయాడు. వాటిని ఎలా బయటికి తీయాలో తెలియక నానా అవస్థలు పడిన మోరిసన్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వాళ్ల అమ్మ పైజ్వార్డ్ను నిద్రలేపి పొరపాటున రెండు మ్యాగ్నటిక్ బాల్స్‌ను మింగానని చెప్పాడు. వెంటనే మోర్సిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పైజ్‌కు విస్తుపోయే నిజం తెలిసింది. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్ డాక్టర్లు ఎక్స్‌రే తీసి మొత్తం 54 బాల్స్ ఉన్నాయని చెప్పారు. ఇవి కడుపులో అలాగే ఉండిపోతే వేరే అవయవాలు పాడై ప్రాణం పోయే అవకాశం ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి సర్జరీని ప్రారంభించారు. ఆరుగంటల పాటు నిర్విరామంగా సర్జరీ చేసి మోరిసన్ మింగిన బాల్స్ అన్నింటినీ బయటకు తీశారు. అప్పటికీ మోరిసన్ పూర్తిగా కోలుకోలేదు. హాస్పిటల్లో 10 రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. పేగుకు రంధ్రం పడడం వల్ల ఆకుపచ్చని ద్రవం ఒకటి విడుదలవ్వడంతో దానిని పూర్తిగా కక్కిన తరువాత గాని అతను కదల్లేకపోయాడు. ఈ సమయంలో అతనికి ట్యూబ్ ద్వారా ఆహారం అందించారు. రెండు వారాలు తరువాత పూర్తిగా కోలుకుని డిచార్జ్ అయ్యాడు మోరిసన్. మోరిసన్‌కు సైన్స్ అంటే ఎంతో ఆసక్తి. ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే కడుపులో మ్యాగ్నెటిక్ బాల్స్ ఉంటే ఐరన్ స్టిక్ తన పొట్టకు అతుక్కుంటుందా లేదా అనే∙విషయం తెలుసుకోవడానికి ఇలా చేసానని మోరిసన్ చెప్పినట్లు తల్లి చెప్పారు. ఈ విషయం మనకు చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ మోరిసన్ చాలా చిన్నవాడు కావడంతో ఇలా చేసాడని ఆమె వివరించారు. -
రూమ్బోట్ కుర్చీలు!
ఇంట్లో రకరకాల పనులను చేసిపెట్టే పలు రోబోల గురించి మనకు ఇదివరకే తెలుసు. అయితే చిత్రంలో రెండు పెద్ద సైజు పాచికలు అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తున్న ఈ బంతులు కూడా అలాంటి రోబోలే. మనం ఆర్డరేస్తే చాలు.. వెంటనే దొర్లుకుంటూ వెళ్లి ఓ టేబుల్‌గా లేదా చైర్‌గా లేదా స్టూల్గా ఎలా కావాలంటే అలా అమరిపోతాయి. రూమ్బోట్స్ అనే రోబోలు ఒక్కోటి 9 అంగుళాల సైజు ఉంటాయి. ఓ బ్యాటరీ, మూడు చిన్న మోటార్ల సాయంతో స్వతంత్రంగా పనిచేస్తూ అవసరమైనప్పుడు ఇతర రోబోలకు, వస్తువులకు కొక్కేల ద్వారా అతుక్కుంటాయి. అన్ని దిక్కులకూ తిరగగలిగే ఈ రూమ్బోట్స్ రకరకాల ఆకారాల్లోకి అమరడమే కాదు.. గదిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి ఆయా వస్తువులను తరలించేందుకు, ఇతర పనులకూ ఉపయోగపడతాయట. సొంతంగా పనులు చేసుకోలేని వికలాంగులు, వృద్ధులకు ఈ రూమ్బోట్స్ బాగా సాయం చేస్తాయని వీటిని తయారు చేసిన స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు అంటున్నారు.