screw
-
ఆడుకుంటూ స్క్రూలు మింగిన బాలుడు.. ఎక్స్‌రే చూస్తే షాక్ అవ్వాల్సిందే..
వర్ధన్నపేట(వరంగల్ జిల్లా): బాలుడు ఆడుకుంటూ స్క్రూలు మింగిన ఘటన శనివారం మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రామోజీ కుమ్మరిగూడెంకు చెందిన రామ్మూర్తి దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు ఆయాన్ష్ (సంవత్సరంన్నర) ఆడుకుంటూ గురువారం సాయంత్రం మూడు స్క్రూలు మింగాడు. చదవండి: ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే ఇది గమనించిన తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురై బాలుడి గొంతులోంచి ఒక స్క్రూ తీయగా మరొకటి బాలుడు గట్టిగ ఊయడంతో బయటపడింది. మరో స్క్రూ గొంతులోంచి కడుపులోకి వెళ్లింది. దీంతో బాలుడికి అవస్థ ఎక్కువగా కావడంతో శనివారం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా కడుపులో స్క్రూ ఉన్నట్లు తేలింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని, మలవిసర్జన ద్వారా బయట పడుతుందని వైద్యుడు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
సరికొత్త ఉపాయం.. ఉద్యోగాన్ని వదిలేసి...
దుబాయ్: కొడుకుపై నమ్మకంతో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో దిగేందుకు ఓ తండ్రి సిద్ధపడ్డాడు. కుమారుడి ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేందుకు ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. గోడలకు మేకులు కొట్టకుండానే బరువులను వేలాడదీసేందుకు దుబాయ్‌లో నివసిస్తున్న భారత టీనేజర్ సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టాడు. జెమ్స్ వరల్డ్ అకాడమిలో ప్రస్తుతం 10వ గ్రేడ్ చదువుతున్న ఇషిర్ వాద్వా తన స్కూల్ ప్రాజెక్టు కోసం ఈ విభిన్న ఆలోచన చేశాడు. ఇంజినీరింగ్ చదువుతున్న తన సోదరుడు అవిక్ సాయంతో ఈ సరికొత్త మార్గాన్ని అన్వేషించారు. కుటుంబ సభ్యులతో ఇషిర్ వాద్వా ఈ పద్ధతిలో భాగంగా స్టీల్ టేపులను ముందుగా గోడకు అతికిస్తారు. ఆ తర్వాత నియోడిమియమ్ అయస్కాంతాన్ని ఉపయోగించి ఆ టేపులు బలంగా గోడకు అతుక్కొని ఉండేలా చేస్తారు. దీనికి వారు క్లాపిట్ అని పేరు పెట్టారు. తమ ఇంట్లోని హోం థియేటర్ సిస్టాన్ని ప్రస్తుతం క్లాపిట్కు తగిలించినట్లు ఇషిర్ తండ్రి సుమేశ్ వాద్వా తెలిపారు. ఎక్కువ వేతనం వస్తున్న తన ఉద్యోగాన్ని వదిలి క్లాపిట్ను తన కుటుంబ బిజినెస్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ‘ఖలీజ్ టైమ్స్’కు వెల్లడించారు. చదవండి: ఒక కారును ఇలా కూడా వాడొచ్చా! -
పుల్ల ఐస్‌లో ఇనుప మేకు !
ఎండ ధాటినుంచి ఉపశమనానికి పుల్ల ఐస్ కొంటే అందులో ఇనుప మేకు దర్శనమిచ్చింది. ఈ సంఘటన విజయనగరంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని పీడబ్ల్యూ మార్కెట్లో కళాసీగా పని చేస్తున్న గెడ్డ వీధికి చెందిన కిలిమి రాజేష్ శనివారం భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక మార్కెట్ ప్రాంతంలో విక్రయిస్తున్న పుల్ల ఐస్‌ను కొనుగోలు చేశాడు. ఐస్ తింటుంటుగా చేతిలో పట్టుకున్న పుల్లతో పాటు రంగుతో పూసిన ఐస్‌లో ఉన్న ఇనుప మేకు దర్శనమిచ్చింది. అవాక్కయిన ఆయన దానిని చుట్టుపక్కల ఉన్నవారికి చూపించారు. ఐస్ తయారీలో ఎంతటి అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనడానికి ఈసంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. – విజయనగరం మున్సిపాలిటీ -
మిల్లీ మీటర్ దూరంలో బతికిపోయాడు
మేరీలాండ్ : ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు’, సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఆరు ఇంచుల మేకు పుర్రెలోకి దిగిన ప్రమాదంలో మిల్లీ మీటర్ దూరంలో బతికిపోయాడు ఓ 13 ఏళ్ల బాలుడు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరీలాండ్కు చెందిన డారియస్ ఫోర్‌మెన్ చెట్టుపై ఇళ్లు నిర్మించుకుంటుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. అయితే కింద ఉన్న ఆరు ఇంచుల కప్ బోర్డు మేకు బలంగా అతని తలలోకి దిగింది. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా కప్బోర్డు 5 ఫీట్లు ఉండటంతో అతన్ని అందులోకెక్కించేందుకు కష్టమైంది. దీంతో 5 ఇంచుల కప్ బోర్డును రెండు ఇంచులుగా కట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎక్స్‌రే తీయగా మేకు అతని పుర్రేలోకి దిగింది. వెంటనే డాక్టర్లు బయటకు ఉన్న మేకును తొలిగించి అనంతరం శస్త్ర చికిత్స ద్వారా లోపలి మేకును తొలిగించారు. ఇది చాలా సున్నితమైన ఆపరేషన్ అని, బాలుడు అదృష్టవంతుడని, మిల్లీమీటర్ దూరంలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు పేర్కొన్నారు. గత శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకోగా డాక్టర్లు ఆదివారం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక గురువారం తన పుట్టిన రోజునాడే డిశ్చార్జ్ కావడం తమ కుమారుడికి పున:జన్మ అని తల్లితండ్రులు తెలిపారు. అంతేగాకుండా 5 ఇంచుల కప్ బోర్డును 7 గంటల సేపు మోసాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంతో చెట్లపై ఇళ్లు నిర్మించరాదనే గుణపాఠం నేర్చుకున్నాని ఆ బాలుడు పేర్కొన్నాడు. -
ముక్కుపుడక తెచ్చిన తంటా!
చెన్నై: మగువుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ముక్కుపుడక ఓ పెద్దావిడ ప్రాణం మీదికి తెచ్చింది. కేవలం అలంకరణ కోసమే కాకుండా.. మహిళలు సాంప్రదాయకంగా ముక్కు పుడకలు ధరించడం ఆనవాయితీ. అలా పెట్టుకున్న ముక్కుపుడక కాస్త ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అది కాస్తా ప్రమాదవశాత్తు ఊపిరితిత్తుల్లో చేరి అపాయకరంగా మారిన ఘటన తమిళనాడు మదురై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్లమ్మాళ్ (78) అనే మహిళ ముక్కు పుడకను తొలగించడానికి బంధువులు ప్రయత్నిచినపుడు పొరపాటున దాని సీల నోట్లోకి జారి, ఊపిరితిత్తుల్లో అడ్డుపడింది. ఆ తర్వాత వారు ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్రమైన శ్వాస సమస్యతో గత నెలరోజులుగా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ రే తీసినపుడు బంగారు ముక్కుపుడక స్క్రూ ఎడమ ఊపిరితిత్తిలో నిలిచిపోయినట్టు గమనించారు. ఆమెకు ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బంది కరంగా మారడంతో దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో థొరాసిక్ సర్జరీ ద్వారా నుంచి దానిని తొలగించారు. బ్రాంకో స్కోపీ (శ్వాస నాళ అంతర్దర్శిని) సహాయంతో ఫోర్ సెప్స్‌తో దానిని బయటకు తీసారు. ఆపరేషన్ అనంతరం వెల్లమ్మాళ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , సాధారణంగా శ్వాస తీసుకోకలుగుతోందని మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం గంట సమయం పట్టిందన్నారు.