ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారంటూ విద్యార్థుల ఫిర్యాదు | Three schoolboys face section 377 in mumbai | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారంటూ విద్యార్థుల ఫిర్యాదు

Published Mon, Jul 25 2016 11:10 AM | Last Updated on Sat, Sep 15 2018 5:34 PM

ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారంటూ విద్యార్థుల ఫిర్యాదు - Sakshi

ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారంటూ విద్యార్థుల ఫిర్యాదు

ముంబై: ముంబై పోలీసులకు ఇటీవల పెద్ద చిక్కే వచ్చి పడింది. దక్షిణ ముంబైలోని ప్రముఖ పాఠశాలలో ఓ ఐదో తరగతి విద్యార్థి, ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పరస్పరం లైంగిక దాడి ఆరోపణలు చేసుకోవటంతో ఏం చేయాలో పాలుపోక ముగ్గురిపై 377( హోమో సెక్సువల్ నేరాలపై చట్టం) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.

ఐదో క్లాస్ విద్యార్థి ఇటీవల.. స్కూల్లో టాయ్లెట్కు వెళ్లిన సమయంలో ఇద్దరు ఆరో తరగతి విద్యార్థులు తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారని తన పేరెంట్స్కు చెప్పడంతో వారు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు సదరు ఆరో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి ప్రశ్నించారు.

అయితే.. ఆరో తరగతి విద్యార్థులు సైతం తమ జూనియర్పై ఇవే ఆరోపణలు చేయడంతో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు గామ్దేవీ పోలీస్స్టేషన్కు చేరారు. దీంతో పోలీసులు విద్యార్థులపై కేసు నమోదుచేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి కేసుల్లో ఎవరినీ అరెస్ట్ చేయటం ఉండదని.. తప్పు చేసిన వారిని చిల్డ్రన్స్ కరెక్షన్ హోమ్కు పంపుతామని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్లకు సంబంధించిన పాఠాలు సైతం చెబుతున్నామని అయినా ఎందుకిలా జరిగిందో అర్థం కావటంలేదని పాఠశాల యాజమాన్యం చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement