మహానంది: చెప్పినోళ్లకి పది రూపాయల బహుమతి.. ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్నారా.. ఇంత చిన్న బహుమతా దేనికి అనుకుంటున్నారా.. ఇదేమి క్విజ్ పోటీ కాదు.. అంతే కాదం డో.. పోస్తే రూ. 20 జరిమానా.. ఈ జరిమానా ఏందీ.. బహుమతి ఎందుకు.. రూ.10, 20ల పంచాయతీ ఏందీ అని ఆలోచిస్తున్నారా... ఒక చిన్న ఆలోచనే.. పెద్ద మార్పు తెచ్చి పెట్టింది.
మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే పాఠశాల తరగతి గదుల సమీపంలో కొందరు విద్యార్థులు మూత్రం పోస్తుండటంతో దుర్వాసన వస్తోంది. దీంతో విద్యార్థులు వారికి వచ్చిన ఐడియా అమలు చేశారు. ఓ అట్టముక్కపై తెల్ల కాగితాన్ని అంటించి ‘విద్యార్థులకు హెచ్చరిక... దయచేసి ఇక్కడ మూత్రం పోయరాదు. పోసినచో రూ. 20 జరిమానా. పోసే వారి గురించి చెప్పిన వారికి రూ. 10 బహుమతి ఇవ్వబడును’ అని రాశారు. ఇంకేముంది బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్కడ మూత్రం పోయడానికి భయపడుతున్నారు. రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ బోర్డుతో సమస్య పరిష్కారమైంది.
Comments
Please login to add a commentAdd a comment