రూ. 200 కోట్లు ఇస్తామన్నా ‘ఐడియా’ ఇవ్వనన్నాడు! | Schoolboy and RecMed CEO Taylor Rosenthal rejected $30 mn offer for his invention first aid kit vending machine | Sakshi
Sakshi News home page

రూ. 200 కోట్లు ఇస్తామన్నా ‘ఐడియా’ ఇవ్వనన్నాడు!

Published Mon, May 16 2016 3:36 AM | Last Updated on Sat, Sep 15 2018 5:34 PM

రూ. 200 కోట్లు ఇస్తామన్నా ‘ఐడియా’ ఇవ్వనన్నాడు! - Sakshi

రూ. 200 కోట్లు ఇస్తామన్నా ‘ఐడియా’ ఇవ్వనన్నాడు!

న్యూయార్క్:
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా విలువ అంత గొప్పది మరి. అదే అమెరికాలో అయితే ఐడియా విలువ సుమారు 200 కోట్ల రూపాయలకు పైమాటే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ స్కూల్ కుర్రాడు రూ. 200 కోట్లు ఇస్తామని చెప్పినా తన ‘ఐడియా’ను ఇవ్వనని చెప్పేశాడు. ఇంతకీ ఆ కుర్రాడెవరు? అతని ఐడియా ఏంటి? అనే వివరాల్లోకెళ్తే....

టేలర్ రోసెంథాల్.. 14 ఏళ్ల కుర్రాడు. అమెరికాలోని ఆల్బామాలో జరిగే బేస్‌బాల్ టోర్నమెంట్స్‌కు తప్పనిసరిగా హాజరయ్యేవాడు. అయితే మ్యాచ్ జరిగిన ప్రతిసారీ తన స్నేహితులు గాయపడడం, ఆ గాయాలకు కట్లు కట్టేందుకు బ్యాండెయిడ్‌ల కోసం వారి తల్లిదండ్రులు మెడికల్ షాపులకు పరుగులు తీయడం గమనించాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని ఓ వెండింగ్ మిషన్ (ఏటీఎం లాంటిది)ను తయారుచేశాడు. మీట నొక్కితే ఫస్ట్‌ఎయిడ్ కిట్ అందులో నుంచి బయటకు వచ్చేలా చేశాడు.

గాయాలు, కోతలు, ఎండకు శరీరం బొబ్బలెక్కడం వంటి వాటికి వేర్వేరు ఫస్ట్‌ఎయిడ్ కిట్‌ను వెండింగ్ మిషన్‌లో ముందుగానే సిద్ధంగా ఉంచాడు. సమస్యను సెలెక్ట్ చేసుకొని, మీట నొక్కితే దానికి సంబంధించిన ఫస్ట్‌ఎయిడ్ కిట్ బయటకు వచ్చేలా చేసిన ఈ ఆలోచన టేలర్‌కు ఎంతగానో పేరు తెచ్చింది. ఇంకేముంది ఆ ఆలోచనకు సంబంధించిన అన్ని హక్కులను తనపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా రెక్‌మెడ్ పేరుతో ఓ స్టార్టప్(అంకుర సంస్థ)ను కూడా ప్రారంభించాడు.

ఇప్పటికే కోట్లాది రూపాయల ఆర్డర్స్..
ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ మల్టీనేషనల్ హెల్త్‌కేర్ సంస్థ ‘ఐడియా’ను అమ్మాల్సిందిగా టేలర్‌ను కోరింది. అందుకు ప్రతిఫలంగా రూ. 200 కోట్లు చెల్లిస్తామంటూ ఆఫర్ చేసింది. అందుకు టే లర్ ససేమిరా అన్నాడు. తానే స్వయంగా మరిన్ని యంత్రాలు తయారు చేసి విక్రయిస్తానని చెబుతున్నాడు. ఒక్కో మిషన్ రూ. 35 లక్షల చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడని, ఇప్పటికే 100 మిషన్ల కోసం ఆర్డర్లు కూడా వచ్చాయని టేలర్ టీచర్ క్లారిండా జోన్స్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement