
మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ప్రేమమ్. నివీన్ పౌలీ, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ వంటి నటులను తెలుగు వాళ్లకు దగ్గరయ్యేలా చేసింది ఈ చిత్రమే. 2015లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా క్లాసిక్ చిత్రంగా నిలిచింది.
ఇక డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రిన్ వర్క్ కి ప్రతి ఒక్కరూ అలా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన తెరకెక్కించిన గోల్డ్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇదిలా ఉండగా లేటెస్ట్‌గా డైరెక్టర్ అల్పోన్స్ లుక్ ప్రేక్షకులను షాక్‌కి గురి చేస్తుంది. ప్రేమమ్ షూటింగ్ సమయంలోనే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
తాజాగా ఆయన పూర్తిగా బక్కచిక్కిపోయి నెరిసిన గడ్డంతో కనిపిస్తున్నారు. దీంతో ఈయన ఏంటి ఇలా అయిపోయారు అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తన హెల్త్ గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అంటూ డైరెక్టర్ అల్పోన్స్ రిప్లై ఇచ్చాడు. కానీ తనకు ఏమైందన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment