
యంగ్ హీరో రానా ఆరోగ్య పరిస్థితిపై చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా రానా బాగా సన్నబడటంతో హెల్త్ ఇష్యూ కారణంగా రానా అలా తగ్గిపోయాడన్న ప్రచారం జరిగింది. తాజాగా రానా అమెరికా పర్యటన విషయంలో ఇవే వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించాయి. రానా ఆరోగ్య పరిస్థితి విషమించిందని కిడ్నీ మార్పిడి జరిగిందన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే ఈ వార్తలపై సూటిగా స్పందించకపోయినా అవన్నీ పుకార్లంటూ కొట్టి పారేశాడు రానా. బుధవారం ఉదయం డియర్ కామ్రేడ్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెపుతూ ఓ వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశాడు రానా. అయితే వీడియో పోస్ట్‌కు కామెంట్స్‌లో అభిమానులు రానాను ఆరోగ్య పరిస్థితిపై ప్రశ్నించటంతో ‘అలాంటి వార్తలను చదవడం మానేయండి’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా అక్కడే డియర్ కామ్రేడ్ సినిమా చూడబోతున్నట్టుగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment