సాక్షి, కృష్ణా: తాను అనారోగ్యానికి గురయ్యానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదంటూ సోషల్ మీడియాలో తనపై నడుస్తున్న ప్రచారంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. శునకానందం కోసమే కొందరు ఇలా చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీని ఉద్దేశించి ప్రత్యక్షంగా విమర్శలు గుప్పించారాయన. మంగళవారం విజయవాడలో మీడియాకు ఎదురైన ఆయన స్పందిస్తూ..
నేను అనారోగ్యానికి గురైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల నాకేం అవ్వదు. ఐటీడీపీ ద్వారా తెలుగు దేశం పార్టీ ఇలాంటి ప్రచారం చేయిస్తోంది. ఇది ఆ పార్టీ దిగజారుడు తననానికి నిదర్శనం. కానీ, చంద్రబాబు నాయుడ్ని రాజకీయాల నుంచి.. రాష్ట్రం నుంచి ఇంటికి సాగనంపే వరకు నేను ఈ భూమ్మీదే ఉంటా.. చంద్రబాబుకి రాజకీయాల నుంచి చరమ గీతం పాడేంత వరకూ ఉంటా.. అంటూ ఘాటుగా స్పందించారాయన.
ఇక.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ వైఖరిపైనా కొడాలి నాని స్పందించారు. వాళ్లిద్దరూ మానసిక వికలాంగులని.. వాళ్లను మానసిక వైకల్య కేంద్రంలో చేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా. 2024 ఎన్నికల తర్వాత వాళ్లను ఆస్పత్రిలో చేరుస్తాం అంటూ సెటైర్ వేశారాయన. ఇక.. దమ్ముంటే తనపై పోటీకి దిగాలని నారా లోకేష్‌కు విసిరిన సవాల్‌ను ఆయన ప్రస్తావించారు. సవాల్ చేసి చాలారోజులైనా లోకేష్ మాత్రం స్పందించడం లేదని కొడాలి నాని అన్నారు.
ఇదీ చదవండి: స్పృహ లేకుండా మాట్లాడడం.. పవన్‌కు అలవాటే కదా!
Comments
Please login to add a commentAdd a comment