![Actress Renu Desai Opens Up About Her Health Issues - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/14/renu_650x400.jpg.webp?itok=MAnz8JFH)
తెరపై అందంగా కనిపించి అందరిని అలరించే హీరోయిన్లు ఈమధ్య కాలంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడగా, మమతామోహన్ దాస్ విటిలిగో అనే చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. తాజాగా మరో నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించింది.
''నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్లకి తెలుసు గత కొన్నాళ్లుగా నేను గుండె, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు. బలంగా నిలబడాలి.
ఏదో ఒక రోజు మన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా. త్వరలోనే దీన్నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటాను'' అంటూ రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కానీ తనకున్న అనారోగ్యం ఏంటన్నది మాత్రం ఆమె పూర్తిగా రివీల్ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment